రాజ్‌ తరుణ్‌ మూవీ.. రొమాంటిక్‌ సాంగ్ రిలీజ్ | Raj Tarun Tortoise Movie Video Song Out Now | Sakshi
Sakshi News home page

Tortoise Movie: రాజ్‌ తరుణ్‌ మూవీ.. రొమాంటిక్‌ సాంగ్ రిలీజ్

Sep 4 2026 7:50 PM | Updated on Sep 4 2026 8:34 PM

Raj Tarun Tortoise Movie Video Song Out Now

రాజ్‌తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టార్టాయిస్‌. ఈ సినిమాకు రిత్విక్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్మెంట్, ఎస్‌కే గోల్డెన్‌ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్‌, ఎన్‌వీఎల్‌ క్రియేషన్స్‌పై శశిధర్‌ నల్ల, విజయ్‌ కుమార్, ఇమ్మడి సంతోష్, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. నీ పరిచయం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్ అందించగా..  చిన్మయి, అనూప్ రూబెన్స్, జాహ్నవి ఆలపించారు. ఈ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ప్రధాన పా​త్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement