అల్లు ‍అర్జున్ రాకా.. రిలీజ్ డేట్ వైరల్ | Allu Arjun Raaka Release Date Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Raaka Release Date: అల్లు ‍అర్జున్ రాకా.. రాక అప్పుడేనా?

Sep 4 2026 5:06 PM | Updated on Sep 4 2026 5:25 PM

Allu Arjun Raaka Release Date Goes Viral On Social Media

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ రాకా. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ‍అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌ ఈ మూవీపై అంచనాలు మరించ పెంచేశాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో టాక్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 2028 జనవరి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ తేదీపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రాకా రిలీజ్ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అధికారిక ప్రకటన వస్తేనే ఫుల్ క్లారిటీ రానుందని తెలుస్తోంది. 

కాగా.. ఈ చిత్రంలో తండ్రి... ఇద్దరు కొడుకులు... ఇలా ట్రిపుల్‌ రోల్స్‌ చేస్తున్నారట అల్లు అర్జున్‌. అంతేకాదు... ఈ మూడు  పాత్రల్లో ఒకటి విలన్‌ రోల్‌ అని సమాచారం. ఇదే నిజమైతే ‘రాకా’ చిత్రంలో హీరోగా, విలన్‌గా అల్లు అర్జున్‌ నటన చూడొచ్చు. ఈ సినిమాలోని ఓ లీడ్‌ రోల్‌లో దీపికా పదుకోణె నటిస్తున్నారు. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement