breaking news
microgreens
-
ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. సాంప్రదాయ సాగు విధానాలు దెబ్బతింటున్న ఈ తరుణంలో, అతి తక్కువ రోజుల్లో, అతి తక్కువ నీటితో, పరిమిత స్థలంలో అత్యధిక పోషకాలను అందించే ‘మైక్రోగ్రీన్స్’ (అతిచిన్న మొక్కలు లేదా అతిచిన్న ఆకుకూరల) సాగు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది.ఈ అతిచిన్న ఆకుకూరల సాగు ఇటు పట్టణ/నగర పరిసర ప్రాంతాల రైతులకు, అటు ఇంటిపంటలు/ మిద్దెతోటల సాగుదారులతో పాటు వినియోగదారులకు వరం. ఎల్‌నినో గడ్డు పరిస్థితుల్లో సాంప్రదాయ పంటలతో పోలిస్తే మైక్రోగ్రీన్స్ సాగు రైతులకు లాభసాటి వ్యాపారంగా మారుతోందని బెంగళూరులోని ఐకార్–భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐకార్–ఐఐహెచ్ఆర్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి. కలైవనన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.మైక్రోగ్రీన్స్ ప్రయోజనాలు... → అత్యల్ప నీటి వినియోగం: ఎల్‌నినో ప్రభావంతో నీటి వనరులు అడుగంటుతున్న తరుణంలో, పొలాల్లో సాంప్రదాయ ఆకుకూరల సాగుతో పోలిస్తే మైక్రోగ్రీన్స్ సాగుకు 90% తక్కువ నీరు సరిపోతుంది → స్వల్పకాలిక పంట: ఇవి కేవలం 7 నుంచి 14 రోజుల్లోనే కోతకు వస్తాయి. తద్వారా రైతులు తక్కువ సమయంలోనే త్వరగా ఆదాయాన్ని పొందవచ్చు → ఇంటిపంట: స్థలం, నీటి కొరత ఉండే పట్టణ, అర్బన్ ప్రాంతాల్లో రూఫ్‌టాప్‌లు, బాల్కనీలు లేదా ఇండోర్ షెల్ఫ్‌లలో వీటిని సులభంగా సాగు చేయవచ్చు. గృహిణులు, పట్టణవాసులు ఇళ్లలోనే చిన్న ట్రేలు, కొబ్బరిపొట్టు సహాయంతో సొంతంగా వీటిని పండించుకోవచ్చు → అధిక లాభాలు: ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన మైక్రోగ్రీన్స్‌కు భారీ ధర పలుకుతుండటం వల్ల, మార్కెటింగ్ నైపుణ్యం గల అర్బన్ రైతులు తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలను ఆర్జించే అవకాశం ఉంది → ఆరోగ్య ప్రయోజనాలు: వాతావరణ మార్పుల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు మైక్రోగ్రీన్స్ ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి → పోషకాల గని: పూర్తిగా పెరిగిన ఆకుకూరలు, కూరగాయలతో పోలిస్తే, మైక్రోగ్రీన్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అత్యధిక సాంద్రతలో ఉంటాయి → జీర్ణవ్యవస్థ మెరుగుదల: మైక్రోగ్రీన్స్ జీర్ణక్రియను మెరుగుపరచటంతో పాటు జీవనశైలి వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. → ఎల్‌నినో సవాల్ విసురుతున్న ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో మైక్రోగ్రీన్స్ సాగు కేవలం ఆహార భద్రతనే కాకుండా, అర్బన్ రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని, వినియోగదారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ‘ఆరోగ్యదాయకమైన, రసాయన రహితమైన అతిచిన్న ఆకుకూరలను స్వయంగా పండించుకుందాం’ అనే నినాదంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.పెరిగిన ఆకుకూరల్లో కన్నా మైక్రోగ్రీన్స్‌లో పోషకాలెక్కువ! విత్తనాలు వేసిన తర్వాత 7–14 రోజుల్లోపు కోతకు వచ్చే అతిచిన్న ఆకుకూరలను మైక్రోగ్రీన్స్ అంటాం. రెండు నెలలు పెరిగిన ఆకుకూరల్లో కన్నా మూడు ఆకులతో ఉండే మైక్రోగ్రీన్స్ ఆకుల్లో పోషకాల సాంద్రత, సువాసన ఎక్కువగా ఉంటాయి. 2–3 అంగుళాలు ఎదిగిన ఈ అతిచిన్న మొక్కల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధిక సాంద్రతలో ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. చిన్న పాటి పాత్రలు, బాక్సుల్లో వీటిని ఇంట్లోనే పెంచుకొని తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. వాణిజ్య స్థాయిలోనూ ఉత్పత్తి చేసి పట్టణాలు, నగర ప్రాంతాల్లో విక్రయించి ఆదాయం పొందవచ్చు. మైక్రోగ్రీన్స్‌ను పెంచే శాస్త్రీయ పద్ధతులపై వచ్చే నెలలో ఆఫ్‌లైన్/ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. – డాక్టర్ డి. కలైవనన్ , సీనియర్ శాస్త్రవేత్త, ఐసీఏఆర్–ఐఐహెచ్ఆర్, హసరఘట్ట లేక్పోస్ట్, బెంగళూరుkalainith2003@gmail.comముఖ్యమైన చిట్కాలు→ రోజూ నీటిని మార్చండి, శుభ్రంగా ఉంచండి → నేరుగా ఈ ట్రేపైన ఎండ పడకుండా, చల్లని, గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచండి → తేమ ఆరిపోకుండా ఉంచటం కోసం రోజుకు 2–5 సార్లు సున్నితంగా నీటిని స్ప్రే చేయండి → విత్తన రకాన్ని బట్టి విత్తిన 7–14 రోజులలోపు మైక్రోగ్రీన్స్‌ను ఉపయోగించుకోండి.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం ..! కట్‌చేస్తే ..
చాలామందికి కార్పొరేట్ జీవితంలో లక్షల్లో జీతం ఆర్జించాలన్నది డ్రీమ్. అందుకోసం ఎంతలానో కష్టపడుతుంటారు. కానీ కొందరు అంత లగ్జరీ లైఫ్‌ని సునాయాసంగా కాదనుకుని వ్యవసాయం వైపుగా అడుగులు వేసి రైతులనకు అండగా నిలుస్తుంటారు. ఆ క్రమంలో కొందరు భారీ లాభాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. అలాంటి కోవకు చెందినవాడే చత్తీశ్‌గఢ్‌కు చెందిన మోహిత్ నిఝూవన్ కూడా. అతడు ఏ పది, ఇరవై లక్షల జీతం కూడా ఏ రేంజ్ కార్పొరేట్ జీతాన్ని కాదనుకున్నాడో వింటే నోటమాటరాదు. మరి ఆ వ్యక్తి అంత లగ్జరీ లైఫ్ వదులుకుని అంతకుమించిన సక్సెస్‌ని ఎలా అందుకున్నాడో తెలుసుకుందామా..!.చత్తీశ్‌గఢ్‌కు చెందిన మోహిత్ నిఝూవన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. హాయిగా బిందాస్లా సాగిపోతున్నా లైఫ్‌కి సడెన్ బ్రేక్‌లు వేసి..అగ్రికల్చర్ రంగం వైపుకి అడుగులు వేశాడు. అది కూడా ఎలాంటి వ్యవసాయం ఎంచుకుంటే బెస్ట్ అని కూలంకషంగా తెలుసుకునేందుకు 2020లో తన ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. నియంత్రిత వాతావరణంలో పెంచగలిగే పోషకాలు అధికంగా ఉండే మొక్కతోట కూరలైన మైక్రోగ్రీన్ అనే ఇండో ఫార్మింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. అనుకున్నదే తడుపుగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు గానీ..పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే..తక్కువ మొత్తంలో పెట్టి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు మోహిత్. అందుకే కేవలం రూ. 30 వేలతో చండీగఢ్‌లోని తన ఇంటి రెండో అంతస్థులో వంద చదరపు అడుగుల స్థలంలో మైక్రోగ్రీన్స్‌ని పెంచడం ప్రారంభించాడు. తొలినాళ్లలో సాగు, ఉత్పత్తి, వినియోగదారులు కొనుగోలు చేసేలా వ్యాపార నమునాని నిర్మించడం వంటి వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఒక చిన్న ప్రయోగంగా మొదలుపెట్టి క్రమంగా ఎవర్గ్రీన్ మైక్రోగ్రీన్గా ఎదగడం ప్రారంభించింది. అలా చిన్న ర్యాక్ కాస్తా మూడు ర్యాక్‌లు, ట్రేలుగా వర్టికల్ ఇండోర్ఫామ్ని స్థాపించాడు. ప్రారంభంలో 21 సేంద్రీయా రకాలపై దృష్టిసారించి రసాయనాలు వినియోగించకుండా సాగు చేస్తే గణనీయమైన ఫలితం వచ్చింది. దాంతో నెమ్మదిగా తన ఫామ్‌ని 500 చదరపు అడుగులకు విస్తరించేలా సొంతంగా ఫామ్‌ని ఏర్పాటు చేశాడు. అది కాస్తా విస్తరించి ఏకంగా 12 వేల ట్రైలు ఉత్పత్తి చేయగల సామర్థ్యానికి చేరుకుంది. అలా ప్రస్తుతం అతను నెలకు 12 లక్షల ఆదాయం చొప్పున ఏడాదికి ఏకంగా 1.44 కోట్లకు పైనే ఆర్జిస్తున్నాడు. కేవలం చిన్న వ్యాపార ప్రయోగంగా మొదలు పెట్టి..కోట్ల ఆదాయానికి చేరుకున్నాడు. అంతేగాదు ఇంటి మిద్దె నుంచి మొదలై..సొంతంగా ఫామ్‌ని నిర్మించుకునే రేంజ్‌కి వెళ్లాడు. అలాగే ఈ మైక్రోగ్రీన్స్ వ్యాపారంలోకి రావాలనుకునే రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ సాగు తోపాటు వాణిజ్యపరమైన అంశాలపై పట్టు సాధించడంతో విజయం సాధించగలిగాడు. అందుకని రైతులకు కూడా ఈ అంశాల్లో తర్ఫీదు పొందేలా సాయం చేస్తుంటాడు. కాగా మోహిత్ తన మైక్రోగ్రీన్ వ్యాపార సక్సెస్ జర్నీని నెట్టింట షేర్ చేసుకోవడంతో గొప్ప ప్రయాణం మిత్రమా..నిజంగా స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.Meet Mohit Nijhawan, a https://t.co/BC6fLkcQNf Computer Science graduate. This guy left his 90 LPA corporate career to grow tiny greens. Today, he has built https://t.co/7yvufGmkSg, a ₹1.44 crore business with approximately ₹60 lakhs in profit annually.He walked away from a… pic.twitter.com/HI4OPKOm7l— Vikas Alwys (@VikasAlwys) September 5, 2026 (చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!) -
Success Story రూ.90 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి కోట్ల ఆదాయం
జీవితంలోపైకి రావాలని, మంచి లాభాలను సాధించాలని సాధారణంగా చాలామంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కానీ తన చుట్టూ ఉండేవారి బాధలు, అనారోగ్యాలను చూసి చలించిపోయి వ్యాపారం ప్రారంభించే వారు చాలా తక్కువ. అదీ అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేసి మరీ ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిజవాన్ (Mohit Nijhawan) అలాంటి వారిలో ఒకరు. ఇంతకీ ఆయన వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు? లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రారంభించడం అంత ఈజీకాదు. ఇందుకు పూర్తి విశ్వాసం, కృషి పట్టుదల ఉండాలి. చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిజవాన్ బయో కెమిస్ట్రీలో పీజీ చేశాడు. ముంబైలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. రూ.90 లక్షల వేతనం. అయితే తన బంధువుల్లో చాలా కేన్సర్ బారిన పడటం, వారిలో చాలా మందికి వైద్య ఖర్చులుగా భారీగా ఉండటం, ఖరీదైన మందులు తీసుకున్న తర్వాత కూడా నయం కాకపోవడం గమనించాడు. ముఖ్యంగా తన సోదరుడు సహా తన దగ్గరి బంధువులు చాలా మంది క్యాన్సర్‌తో బాధపడుతుండటం ఆయనను బాధించింది. అందులోనూ ఒక పిల్లవాడు తన కళ్ల ముందే చనిపోవడం తట్టుకోలేకపోయాడు. ఈ కేన్సర్ కేసులు అంటువ్యాధులు కావని, జీవనశైలి , డైటరీఆహార పదార్థాల వల్ల వస్తున్నాయని గుర్తించాడు. అంతే సంచలన నిర్ణయంతీసుకున్నాడు. 2020లో ఉద్యోగాన్ని వదిలివేసి మైక్రోగ్రీన్స్ (microgreens) పెంచాలని నిర్ణయించుకున్నాడు.తన స్నేహితుడితో కలిసి 21వ శతాబ్దపు వెజ్జీ స్టార్టప్‌గా చెప్పుకునే మైక్రోగ్రీన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ స్నేహితుడు మోసం చేయడంతో భారీ ఆర్థిక నష్టాన్ని చవి చూశాడు. మరోవైపు కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని కూడాఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే చక్కటి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించడం మోహిత్ తల్లిదండ్రులకు సుతరామూ ఇష్టం లేదు. కానీ మోహిత్ పట్టువీడలేదు. View this post on Instagram A post shared by GREENU: LIVE MicroGreens - A product by Embryonic Greens (@greenu_microgreens) మోహిత్ 2022 సంవత్సరంలో రూ. 30 వేల పెట్టుబడితో తన వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాడు. 500 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. బ్రోకలీ, కాలీఫ్లవర్, ఆవాలు, మెంతులు, ముల్లంగి మొదలైన 21 రకాల విత్తనాలతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. చండీగఢ్‌కు చెందిన ఒక ఆంకాలజిస్ట్‌కు విక్రయించాడు. అక్కడ మైక్రోగ్రీన్స్ తినిడం వల్ల కొంతమంది రోగుల ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో తన ఆశయం నెరవేరిందన్న ఉత్సాహం వచ్చింది మోహిత్‌కు. ఎంబ్రియోనిక్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాడు. గ్రీను బ్రాండ్ పేరుతో మైక్రోగ్రీన్లను విక్రయిస్తోంది. బీట్రూట్, ముల్లంగి, తులసి, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు, బ్రోకలీ, ముల్లంగి, బఠానీలు వంటి అనేక రకాల మైక్రోగ్రీన్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలే కాకుండా, రెస్టారెంట్లు, జిమ్‌లు, కేఫ్‌లు ఈ కంపెనీ కస్టమర్లలో భాగం.చదవండి: చాక్లెట్లు అంటే పిచ్చి : కట్ చేస్తే.. ఏడాదికి కోటి రూపాయలుఔత్సాహికులకు శిక్షణమోహిత్ మైక్రోగ్రీన్లను అమ్మడమే కాకుండా, వాటిని పెంచడంపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాడు. మైక్రోగ్రీన్స్ అమ్మకాల ద్వారా నెలకు రూ.12 లక్షల వ్యాపారం చేస్తున్నాడు, అంటే ఏటా దాదాపు రూ.1.44 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ.5 లక్షలు. అలాగే ప్రతీ ఏటా రూ.60 లక్షలు లాభం సంపాదిస్తున్నాడు.ఇదీ చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి?విత్తనాలను మట్టి లేకుండా, కేవలం నీటి సహాయంతో ట్రేలలో పెంచుతారు. ఇవి మొలకెత్తిన కొన్ని రోజుల తర్వాత (7 -10 రోజులలోపు), చిన్న చిన్న మొలకలుగా ఉన్నపుడే సలాడ్లు, శాండ్విచ్లు లేదా ఏదైనా ఇతర ఆహారంలో ఉడికించకుండానే ఉపయోగిస్తారు. వీటిల్లో సాధారణ ఆకుకూరల కంటే 40 శాతం ఎక్కువ పోషకాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా, కేన్సర్ వంటి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. వీటికి పెంచడానికి, పొలం లేదా భూమి అవసరం లేదు. నీటి సహాయంతో కేవలం ట్రేలలోనే పెంచుతారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటాయి.


