ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా కరణ్‌ రాజేంద్ర దర్దా | Karan Rajendra Darda Elected as INS president for 2026-27 | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా కరణ్‌ రాజేంద్ర దర్దా

Sep 8 2026 1:05 PM | Updated on Sep 8 2026 1:07 PM

Karan Rajendra Darda Elected as INS president for 2026-27

న్యూఢిల్లీ: దేశంలో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్‌ ప్రచురణకర్తల సంఘం అయిన ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌)కి 2026–27 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా కరణ్‌ రాజేంద్ర దర్దా (లోక్‌మాత్‌) ఎన్నికయ్యారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన 67వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఎన్నికను ప్రకటించారు. 

అలాగే ఐఎన్‌ఎస్‌ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా తన్మయ్‌ మహేశ్వరి (అమర్‌ ఉజాలా), వైస్‌ ప్రెసిడెంట్‌గా హర్ష మ్యాథ్యూ (వనిత), గౌరవ ట్రెజరర్‌గా అనంత్‌నాథ్‌ (గృహశోభిక) ఎన్నికయ్యారు. ఐఎన్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌గా మేరీ పాల్‌ కొనసాగనున్నారు. మరోవైపు 41 మందితో కూడిన ఐఎన్‌ఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల్లో కె.ఆర్‌.పి. రెడ్డి (సాక్షి), ఐ. వెంకట్‌ (ఈనాడు), వివేక్‌ గోయెంకా (ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌–ముంబై), జయంత్‌ మామ్మెన్‌ మ్యాథ్యూ (మలయాళ మనోరమ) ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement