రిబాకినాదే టైటిల్‌ | Elena Rybakina defeats defending champion Sabalenka win 2026 US Open | Sakshi
Sakshi News home page

రిబాకినాదే టైటిల్‌

Sep 14 2026 1:42 AM | Updated on Sep 14 2026 1:42 AM

Elena Rybakina defeats defending champion Sabalenka win 2026 US Open

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌) చాంపియన్‌గా అవతరించింది. టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంకా (బెలారూస్‌)తో జరిగిన ఫైనల్లో రిబాకినా 2 గంటల 21 నిమిషాల్లో 6–4, 5–7, 6–2తో గెలుపొందింది. రిబాకినా కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కాగా...తొలిసారి ఆమె యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 

నేడు తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకోనున్న రిబాకినా 2022లో వింబుల్డన్, 2026లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించింది. 2024, 2025 చాంపియన్‌ సబలెంకా ‘హ్యాట్రిక్‌’ సాధించాలని ఆశించినా రిబాకినా అద్భుత ఆటతీరుతో బెలారూస్‌ స్టార్‌ ఆశలను వమ్ము చేసింది. విజేత రిబాకినాకు 55 లక్షల డాలర్లు (రూ. 52 కోట్ల 49 లక్షలు), రన్నరప్‌ సబలెంకాకు 28 లక్షల డాలర్లు (రూ. 26 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement