చైనాలో తుపాను బీభత్సం  | Flash flood triggered by sudden heavy rainfall in northwest China | Sakshi
Sakshi News home page

చైనాలో తుపాను బీభత్సం 

Jul 27 2026 5:31 AM | Updated on Jul 27 2026 5:31 AM

Flash flood triggered by sudden heavy rainfall in northwest China

ఆకస్మిక వరదలతో 10 మంది మృతి 

బీజింగ్‌: నౌల్‌ తుపాను చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. వాయవ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు 10 మంది మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. జాతీయ సమగ్ర అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ హుయిజౌ నగర సమీపంలో ఆదివారం తెల్లవారుజామున తుపాను తీరం దాటింది. 

దీంతో గంటకు 162 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తుపాను తీవ్రతను ఊహించిన హోం శాఖ 28 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రవాణా వ్యవస్థ దెబ్బతిని వందలాది విమానాలు, హైస్పీడ్‌ రైలు సరీ్వసులు రద్దయ్యాయి. గ్వాంగ్‌జౌ, షెన్‌జెన్‌లలో 700కు పైగా విమానాలను నిలిపేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement