ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’ | Lost Everything In One Night Ramban Residents | Sakshi
Sakshi News home page

ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’

Apr 20 2025 9:47 PM | Updated on Apr 20 2025 9:47 PM

Lost Everything In One Night Ramban Residents

‍న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపానికి జమ్మూ కశ్మీర్ లోని రాంబాన్ కు చెందిన చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీ వరద నీటికి ఒక్క రాత్రిలోనే తమ జీవితం తల్లకిందులైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తులు, ఇళ్లులు అన్నీ కూడా ఆ ఘటనతో కోల్పోయమని పలువురు  కన్నీటి పర్యంతమయ్యారు.  

ఇందులో  ఓం సింగ్ అనే దుకాణదారుడు తన షాపు ఎలా నీటిలో కొట్టుకుపోయిందో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను అవతలి వైపు ఉంటున్నాను. కానీ అక్కడ నీటి ప్రవాహం చాలా అధికంగా ఉంది. మేము  ఇక్కడకి సకాలంలో చేరుకోలేక పోయాం. నేను ఇక్కడికి చేరుకునే సరికి నా షాపు సహా మొత్తం మార్కెట్ అంతా అదృశ్యమైంది. దీనిని నేను కళ్లారా చూశాను. ఇలాంటింది చూడటం ఇదే తొలిసారి’ అని రాంబన్ నివాసి ఓమ్ సింగ్ తెలిపాడు.

ఇది ఒక్క రాంబన్ పరిస్థితే కాదు. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. తమ సర్వస్వం కోల్పోయామని వారు విలపిస్తున్నారు. వరద నీటి ప్రవాహానికి కొండచరియలు విరిగిపడటమే కాదు తాము సర్వస్వం కోల్పోయామని అంటున్నారు.  కొండచరియలు విరిగిపడిన కారణంగా చాలా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు కొందరు పేర్కొన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement