
ప్రజ్ఞా ఠాకూర్ సంచలన ఆరోపణ
ముంబై: 2008 నాటి మాలెగావ్ పేలుడు ఘటన కేసు నుంచి బయటపడిన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులకు పేలుళ్లతో సంబంధం ఉందని చెప్పాలంటూ అధికారులు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతోపాటు చిత్రహింసలు పెట్టారన్నారు.
‘నాపై ఒత్తిడి చేసి, నేను చెప్పిన ప్రతి విషయాన్ని రాత పూర్వకంగా తీసుకున్నారు. మేం చెప్పినట్లుగా ఆయా పేర్లను చెబితే కొట్టబోమని నాకు మాటలు చెప్పారని’ ఆరోపించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీయే ఆ కుట్ర పన్నిందని, కాషాయాన్ని, సాయుధ బలగాలను అప్రతిష్ట పాలు చేయాలన్న భారీ కుట్ర దీని వెనుక దాగుందని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి: