తెలంగాణకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం కీలక ప్రకటన | Minister ashwini vaishnaw Announcement On Telangana Bullet Trains | Sakshi
Sakshi News home page

తెలంగాణకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం కీలక ప్రకటన

Feb 2 2026 4:33 PM | Updated on Feb 2 2026 4:53 PM

Minister ashwini vaishnaw Announcement On Telangana Bullet Trains

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. రూ.5,454 కోట్ల నిధులు తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు కేటాయించినట్టు తెలిపారు. త్వరలోనే బుల్లెట్‌ ట్రైన్‌కు హైదరాబాద్‌ హబ్‌గా మారుతుందన్నారు.

ఈ సందర్బంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు ఇచ్చాం. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అన్నీ ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మిస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. బుల్లెట్ ట్రైన్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతుంది. ఇది సౌత్ ఇండియా డైమండ్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు.  అలాగే, 10,134 కోట్ల రూపాయల బడ్జెట్ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేటాయించాం. హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైలుతో 2:55 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైలు వెళుతుంది అని చెప్పుకొచ్చారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ ప్రక్రియ చాలా జటిలమైనది. సిబ్బంది మొత్తం మార్చాల్సిన అవసరం ఉంది. కంట్రోల్స్, కమాండ్, టైం టేబుల్ కూడా మార్పు జరగాలి. ఇదంతా కూడా చాలా జటిలమైన ప్రక్రియ. కొత్త జోన్ ఏర్పాటుకు గతంలో మూడు నాలుగు ఏళ్ళు పట్టేది. ఈసారి మేము చాలా ఫాస్ట్ ట్రాక్‌లో పనిచేస్తున్నాం. సజావుగా ఈ మార్పిడి ప్రక్రియ జరిగేందుకు పనిచేస్తున్నాం. సౌత్ కొస్టల్ జోన్ రైల్వే కార్యాలయం నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. చాలా వేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది అని తెలిపారు. 

  • హైదరాబాద్-బెంగళూరు (రెండు గంటల జర్నీ)

  • హైదరాబాద్-చెన్నై(2:55 గంటల జర్నీ)

  • హైదరాబాద్-పుణె (1:45 గంటల జర్నీ)

  • హైదరాబాద్-చెన్నై ,

  • కోల్‌కతా-చెన్నై.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement