‘ఇది దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్‌’ | BJP MP Bandi Sanjay Praises Union Budget 2026 27 | Sakshi
Sakshi News home page

‘ఇది దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్‌’

Feb 2 2026 11:59 AM | Updated on Feb 2 2026 12:26 PM

BJP MP Bandi Sanjay Praises Union Budget 2026 27

హైదరాబాద్‌:  కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశంసలు కురిపించారు. ఇది దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్‌ అంటూ కొనియాడారు. ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని ఈ బడ్జెట్‌ ముందుకు నడిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 

‘ఉపాధి అవకాశాలను, మౌలిక వసతులకు పెద్దపీట వేసిన బడ్జెట్. రక్షణ,  రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట.‘గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర. వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ - గ్రామీణ్ (VB GRAM G)కి  నిధుల పెంపు. ఉచితం కంటే ఉపాధి అవకాశాలు కల్పించడమే బడ్జెట్ లక్ష్యం. 

గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే బడ్జెట్. నవ భారత యువత  భవిష్యత్‌కు  పెట్టుబడి ఈ బడ్జెట్. సంక్షేమం + అభివృద్ధి = నేటి బడ్జెట్’ అని స్పష్టం చేశారు బండి సంజయ్‌. 

Advertisement
 
Advertisement
Advertisement