హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ నిరసిస్తూ 7 వేల గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టారని, మమ్మల్ని తట్టిలేపిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది.మంత్రి వాహనంపై దాడి జరగడం, మొదటిసారి. నిన్న కేసీఆర్ సిట్ విచారణకు రావాల్సిన అవసరం లేదు.
చట్టం అంటే కేసీఆర్‌కు గౌరవం. అందుకే సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న మా ఇంటి చుట్టు వెయ్యి మంది పోలీసులను పెట్టారు. లా అండ్ ఆర్డర్ పై పోలీసులు దృష్టి పెడితే బావుంటుంది. సుల్తాన్ బజార్‌లో పట్టపగలే ATM దగ్గర చోరి జరిగింది.నల్లమల సాగర్ తో నీళ్ల దోపిడి జరుగుతుంది
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి , సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళాడు. సింగరేణి కుంభకోణం బయట పెట్టాలి. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇచ్చారో వివరాలు బయట పెట్టాలి. సృజన్ రెడ్డి కాల్ డాటా బయట పెడితే అన్ని వాస్తవాలు తెలుస్తాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రౌడిలను వేసుకొని తిరుగుతున్నాడు. కేసు పెట్టిన సీఐ హాబీబుల్లా ఖాన్‌ను అందుకే ట్రాన్సఫర్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు. హరీష్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది
ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించాలి.సజ్జనార్ అయిన, ఇంకో అధికారి అయిన ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి కదా?, సజ్జనార్ జడ్జి కాదు , పోలీస్ అధికారి మాత్రమే. మరి ఈ మధ్య కాలంలో సజ్జనార్ జడ్జి అయ్యాడేమో నాకు అయితే తెలియదు. బిజెపి జాతీయ అధ్యక్షుడుకి పరిచయ కార్యక్రమం ఉంటే రాష్ట్రానికి రావొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో... పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి’ అని విమర్శించారు.
ఇదీ చదవండి:
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ


