
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా త్రికూట పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవి ఆలయ తీర్థయాత్ర ఈ నెల17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే, వాతావరణం అనుకూలంగా ఉంటేనే యాత్ర మొదలవుతుందని ఆలయ బోర్డు మంగళవారం తెలిపింది. ఆగస్ట్ 26వ తేదీన ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి పడి 34 మంది యాత్రికులు చనిపోవడం తెల్సిందే.
ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా యాత్రను నిలిపివేశారు. ఈ నెల 14వ తేదీన యాత్ర పునఃప్రారంభం అవు తుందని ఆలయ బోర్డు ప్రకటించింది. అయితే, ఎడతెరిపి లేని వానలతో వాయిదా వేస్తున్నట్లు తెలి పింది. అయితే, రెండు రోజుల క్రితం కొందరు యాత్రికులు కాట్రా బేస్ క్యాంప్ వద్ద ఆందోళనకు దిగడంతో యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.