జమ్ము కశ్మీర్‌లో భారీ పేలుడు.. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు | 8 Killed 27 Injured After Explosives At Jammu and Kashmir Srinagar | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌లో భారీ పేలుడు.. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు

Nov 15 2025 6:15 AM | Updated on Nov 15 2025 8:53 AM

8 Killed 27 Injured After Explosives At Jammu and Kashmir Srinagar

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ (Jammu Kashmir)లో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. పోలీసు స్టేషన్‌లో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందగా, 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్‌ సిబ్బంది అని అధికారులు తెలిపారు.

వివరాల ప్రకారం.. ఇటీవల ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను జమ్ముకశ్మీర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచారు. ఈ సందర్భంగా పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్‌ తీస్తుండగా పేలుడు సంభవించింది. శుక్రవారం రాత్రి 11.22 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది.

 

పేలుడు కారణంగా పోలీసు స్టేషన్‌ కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు పేర్కొన్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయినవారిని ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌లోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు మృతదేహాలను తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో పార్కింగ్‌లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. మరోవైపు.. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా.. ఇటీవల హర్యానా, జమ్ము కశ్మీర్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పేలుడు పదార్థాలను నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తాజా పేలుడు ఘటనతో ప్రాణ నష్టం జరిగింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement