జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది? | Omar Abdullah discusses Jammu Kashmir situation with PM Modi | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది?

May 3 2025 7:13 PM | Updated on May 3 2025 7:36 PM

Omar Abdullah discusses Jammu Kashmir situation with PM Modi

ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ

న్యూఢిల్లీ:  పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. ఈరోజు( శనివారం) ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన ఒమర్ అబ్దుల్లా.. దాదాపు అరగంట పాటు మోదీతో చర్చించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు గురించి మోదీకి ఒమర్ అబ్దుల్లా వివరించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పహల్గామ్‌ పరిస్థితిపై ప్రత్యేకంగా మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.  ఏప్రిల్ 22వ తేదీన కశ్మీర్ ప్రాంతమైన పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత మోదీతో ఒమర్ అబ్దుల్లా సమావేశం కావడం ఇదే తొలిసారి.

ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది.  ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement