
గ్రామం నుంచి ఆర్మీలో వంద మందికి పైగా సైనికులు
వేర్వేరు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తు్తన్న వారిని యుద్ధభూమికి తరలింపు
ఆనందంగా ఉందంటూ ఆత్మీయులకు ధైర్యం చెబుతున్న జవాన్లు
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్మీనే. కుటుంబాలకు దూరంగా ఉంటూ భరతభూమికి వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. రేయింబవళ్లు శత్రు మూకల బుల్లెట్లు, బాంబుల మోతల మధ్య నిత్యం పోరాటం చేసే సైనికులే మన ధైర్యం. ఆ సైన్యంలో దాదాపుగా వంద మందికి పైగా హస్నాబాద్ వాసులు విధులు నిర్వహిస్తున్నారు.
దుద్యాల్: యువత సరిహద్దులో సేవ చేసేలక్ష్యంతో ఆర్మీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామం నుంచి వంద మందికి పైగా దేశ రక్షణలో సైనికులుగా చేరారు. ప్రతీ సెలక్షన్ నుంచి ఇద్దరి నుంచి ఐదుగురు వరకు సైన్యంలో చేరడం ఆనాయితీగా మారింది. 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన చేరికలు నేటికీ కొనసాగుతూ దేశ సేవలో తరిస్తున్నారు. ప్రతీ ఏడాది పది మంది పదవీ విరమణ పొందుతుంటే మరో పది మంది సైన్యంలో చేరుతుంటారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున సైన్యంలో విధులు నిర్వహిస్తున్న వారు వంద మందికి పైగా ఉన్నారు.
రక్తం ఉరకలేస్తోంది
ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం ప్రారంభమైంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన దాదాపు 50 మంది వరకు సైనికులను జమ్మూకశ్మీర్ ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా సాధారణ విధులు నిర్వహించిన తమకు ప్రస్తుతం మధురానుభూతి కల్గుతోందని కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శత్రు దేశం పాకిస్తాన్‌తో యుద్ధం అంటే రక్తం ఉరకలేస్తుందంటున్నారు. హైదరాబాద్, నాసిక్, బెంగళూర్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ వంటి ప్రధాన నగరాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలించినట్లు అందులో హస్నాబాద్‌కు చెందిన వారు సైతం ఉన్నారని సైనికులు చెబుతున్నారు. ప్రాణభయం లేకుండా దేశసేవకు సిద్ధంగా ఉన్నామని.. ఉగ్రవాదులను అంతం చేయడానికి మంచి అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఘ
ఇదీ చదవండి : వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్న
కార్గిల్ యుద్ధంలో నేను సైతం
ఇంతియాజ్ అలీ 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధ సమయంలో పాక్–బంగ్లా దేశాలు కొన్ని ప్రాంతాలు విడుపోయాయని ఆయన చెప్పారు. భారత్ నుంచి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనడం ఆత్మ సంతృప్తినిచ్చిందన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలోనూ పాలుపంచుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొనే అవకాశం హస్నాబాద్‌కు చెందిన సైనికులకు దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి : Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!
గర్వంగా ఉంది
భారత్–పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ విధుల్లో ఉన్నా. ప్రస్తుతం చైనా సరిహద్ధులోని లడక్ ప్రాంతంలో భద్రత బలగాల్లో ఉన్నాను. ఇన్నాళ్ల విధుల కంటే ఇప్పుడే సంతృప్తిగా ఉంది. ప్రాణాలకు తెగించి ప్రత్యర్థిపై యుద్ధం చేయడమే లక్ష్యం. దేశసేవలో పాల్గొంటున్నందుకు గర్వంగా ఉంది. -జి.ఆశప్ప, నాయక్ సుబేదార్
పిలుపు వస్తే పరుగెత్తుతాం
ప్రస్తుతం భారత్–మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. మన దేశం శత్రుమూకపై దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టేందుకు భారత సైన్యం తలమునకలైంది. మాజీ సైనికులకు పిలుపువస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. యుద్ధం చేయాలనే ఆసక్తితో ఉన్నాం. – బసప్ప, మాజీ సైనికుడు, హస్నాబాద్