hasnabad
-
Operation Sindoor సలాం, హస్నాబాద్!
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్మీనే. కుటుంబాలకు దూరంగా ఉంటూ భరతభూమికి వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. రేయింబవళ్లు శత్రు మూకల బుల్లెట్లు, బాంబుల మోతల మధ్య నిత్యం పోరాటం చేసే సైనికులే మన ధైర్యం. ఆ సైన్యంలో దాదాపుగా వంద మందికి పైగా హస్నాబాద్ వాసులు విధులు నిర్వహిస్తున్నారు. దుద్యాల్: యువత సరిహద్దులో సేవ చేసేలక్ష్యంతో ఆర్మీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామం నుంచి వంద మందికి పైగా దేశ రక్షణలో సైనికులుగా చేరారు. ప్రతీ సెలక్షన్ నుంచి ఇద్దరి నుంచి ఐదుగురు వరకు సైన్యంలో చేరడం ఆనాయితీగా మారింది. 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన చేరికలు నేటికీ కొనసాగుతూ దేశ సేవలో తరిస్తున్నారు. ప్రతీ ఏడాది పది మంది పదవీ విరమణ పొందుతుంటే మరో పది మంది సైన్యంలో చేరుతుంటారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున సైన్యంలో విధులు నిర్వహిస్తున్న వారు వంద మందికి పైగా ఉన్నారు. రక్తం ఉరకలేస్తోంది ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం ప్రారంభమైంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన దాదాపు 50 మంది వరకు సైనికులను జమ్మూకశ్మీర్ ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా సాధారణ విధులు నిర్వహించిన తమకు ప్రస్తుతం మధురానుభూతి కల్గుతోందని కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శత్రు దేశం పాకిస్తాన్‌తో యుద్ధం అంటే రక్తం ఉరకలేస్తుందంటున్నారు. హైదరాబాద్, నాసిక్, బెంగళూర్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ వంటి ప్రధాన నగరాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలించినట్లు అందులో హస్నాబాద్‌కు చెందిన వారు సైతం ఉన్నారని సైనికులు చెబుతున్నారు. ప్రాణభయం లేకుండా దేశసేవకు సిద్ధంగా ఉన్నామని.. ఉగ్రవాదులను అంతం చేయడానికి మంచి అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఘఇదీ చదవండి : వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్న కార్గిల్ యుద్ధంలో నేను సైతం ఇంతియాజ్ అలీ 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధ సమయంలో పాక్–బంగ్లా దేశాలు కొన్ని ప్రాంతాలు విడుపోయాయని ఆయన చెప్పారు. భారత్ నుంచి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనడం ఆత్మ సంతృప్తినిచ్చిందన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలోనూ పాలుపంచుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొనే అవకాశం హస్నాబాద్‌కు చెందిన సైనికులకు దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు. ఇదీ చదవండి : Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!గర్వంగా ఉంది భారత్–పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ విధుల్లో ఉన్నా. ప్రస్తుతం చైనా సరిహద్ధులోని లడక్ ప్రాంతంలో భద్రత బలగాల్లో ఉన్నాను. ఇన్నాళ్ల విధుల కంటే ఇప్పుడే సంతృప్తిగా ఉంది. ప్రాణాలకు తెగించి ప్రత్యర్థిపై యుద్ధం చేయడమే లక్ష్యం. దేశసేవలో పాల్గొంటున్నందుకు గర్వంగా ఉంది. -జి.ఆశప్ప, నాయక్ సుబేదార్ పిలుపు వస్తే పరుగెత్తుతాం ప్రస్తుతం భారత్–మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. మన దేశం శత్రుమూకపై దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టేందుకు భారత సైన్యం తలమునకలైంది. మాజీ సైనికులకు పిలుపువస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. యుద్ధం చేయాలనే ఆసక్తితో ఉన్నాం. – బసప్ప, మాజీ సైనికుడు, హస్నాబాద్ -
బాలకృష్ణ హామీలన్నీ మునిగె..
హిందూపురం: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే ఆ రోజు రాత్రంతా జాగరణ ఉండాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. హిందూపురంలోనే ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాలకృష్ణ.. గెలిచాక నియోజకవర్గానికి రావడం కూడా మానేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న హస్నాబాద్ వర్షం వస్తే చెరువును తలపిస్తుంది. అదేవిధంగా గాంధీనగర్, ఆజాద్‌నగర్ ప్రాంతాలు కూడా వర్షం వచ్చిన ప్రతిసారీ నిండిపోతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రూ.10 లక్షలు మంజూరైనా పనుల్లేవ్ న్యూ హస్నాబాద్ నుంచి అహ్మద్ నగర్ వరకు ప్రత్యేక డ్రైన్ నిర్మించడానికి ప్రభుత్వం రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు ఎనిమిది నెలల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేశారు. అయినా ఈ పనులను ఇంతవరకు మొదలు పెట్టలేదు. మాగోడు పట్టించుకునే వారు లేరు వర్షం వస్తే భయమేస్తుంది. డ్రైన్ల మురికి వర్షపునీరంతా ఇళ్లలోకి వచ్చేస్తుంది. పిల్లలు, పెద్దలు రాత్రంతా ఇంట్లో చేరిన నీటిని ఎత్తివేయడం సరిపోతుంది. ఎన్నికల సమయంలో సమస్య పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. –రజీయా, హస్నాబాద్ ఇబ్బందులు తప్పడం లేదు వర్షపునీరు ఇళ్లలోకి రాకుండా అండర్ డ్రైన్ ద్వారా బయటకు వెళ్లడానికి కొత్త డ్రైన్ వేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా వచ్చి మూడునెలల్లో పూర్తి చేసి సమస్య లేకుండా చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏమిచేయలేదు. మాకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. - వాజిద్, హస్నాబాద్ కౌన్సిల్లో చాలాసార్లు ప్రస్తావించా హస్నాబాద్, అహ్మద్‌నగర్, గాంధీనగర్ ప్రాంతాల ఇబ్బందుల గురించి చాలాసార్లు కౌన్సిల్లో ప్రస్తావించాను. అధికారులు ఇదిగో.. అదిగో.. అంటున్నారే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. కనీసం కాల్వలు కూడా శుభ్రం చేయించడం లేదు. - ఆసీఫ్‌వుల్లా, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ -
హస్నాబాద్‌లో ఇంటింటికొక సైనికుడు
-
ఎరువులు కరువు
రబీ రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. సాగుకు సరిపడా ఎరువులను సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగిపోవడంతో అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. సొసైటీలు, ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు బారులు తీరిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు లక్షా 13,058 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని ప్రతిపాదించగా.. కేవలం 77,549 మెట్రిక్ టన్నులే సరఫరా అయింది. యూరియా వచ్చింది వచ్చినట్టు ఎప్పటికప్పుడు సొసైటీలకు సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. ఐదు నెలల నుంచి డీఏపీ, ఎంవోపీ ఎరువులను ప్రతిపాదించినా జిల్లాకు సక్రమంగా ఠ మొదటి పేజీ తరువాయి పంపిణీ చేయడం లేదు. నెలవారీగా ఎరువులను పంపిణీ చేస్తున్నప్పటికీ ఫిబ్రవరిలో అవసరమైన యూరియా కేటాయించడంలో విఫలమయ్యారు. 19,550 టన్నుల యూరియా అవసరమని ప్రతిపాదించినా 12,696 టన్నులే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఎంవోపీ, డీఏపీ ఎరువులు అసలే కేటాయించలేదు. 4,214 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్ వద్ద, 910 టన్నుల యూరియా ప్రైవేట్ డీలర్ల వద్ద బఫర్ స్టాక్ ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తేరుకుని యూరియా కొరత నివారించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాకు కేటాయించిన ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, 50 శాతం ప్రైవేట్ డీలర్లకు కంపెనీలు కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలో మార్క్‌ఫెడ్ నుంచి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఆయా మండలాలకు కేటాయించిన కోటా ప్రకారం పంపిణీ జరుగుతోంది. సహకార సంఘాల వద్ద రాజకీయ పైరవీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద దోపిడీ వెరసి అన్నదాతకు తీవ్ర కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన సాగు సాగు విస్తీర్ణం పెరగడమే యుూరియూ కొరతకు ప్రధాన కారణం. జిల్లాలో 2,32,926 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 2,93,663 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వరి సాధారణ విస్తీర్ణం 1,48,757 హెక్టార్లు కాగా 2,06,350 హెక్టార్లలో సాగయ్యింది. మొక్కజొన్న 50,033 హెక్టార్లలో సాగవుతుండగా మిగిలిన ప్రాంతంలో ఇతర పంటలు సాగవుతున్నాయి. వరి అత్యధికంగా మానకొండూర్, ధర్మపురి, జగిత్యాల, వీణవంక, కేశవపట్నం, కరీంనగర్, వెల్గటూర్ తదితర మండలాల్లో సాగవుతోంది. ఈ క్రమంలో మండలాల వారీగా అవసరమున్న ఎరువుల కేటాయింపులో సంబంధిత శాఖ నిర్లక్ష్యంతో యూరియా కొరత వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. వరిలో ఇప్పుడు ప్రధానంగా యూరియే వేసే సమయం. ముందునాటు పడ్డ వారు రెండో విడత యూరియా వేస్తుండగా ఆలస్యంగా నాటు వేసిన వారు మొదటి దఫా యూరియా వేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయశాఖ అధికారుల సూచనలకంటే ఎక్కువ వినియోగించడం కూడా కొరతకు కారణమవుతోంది. ఎకరాకు 50 కిలోల యూరియా వేసుకోవాలని సూచిస్తున్నా ఎకరానికి క్వింటాల్ వరకు వేస్తున్నారు. సహకార సంఘాల్లో ఎకరానికి రెండు బస్తాలే ఇస్తుండడంతో ఇవి ఏ మాత్రం సరిపోవని రైతులు గొడవకు దిగుతున్నారు. ఈ విషయమై జేడీఏ బి.ప్రసాద్ మాట్లాడుతూ యూరియాకు డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనని, కొరత మాత్రం లేదని తెలిపారు. నెలవారీగా సరిపడా ఎరువులు తెప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతుల బారులు హుస్నాబాద్, న్యూస్‌లైన్ : యూరియా కొరత రైతులను ఇబ్బందులపాలు చేస్తోంది. దొరుకుతుందో లేదోనని రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. హుస్నాబాద్ సింగిల్‌విండో కార్యాలయానికి శనివారం 680 బస్తాలు యూరియా రాగా వందలాది మంది రైతులు తరలివచ్చి భారీ క్యూ కట్టారు. రైతుకు రెండుబస్తాల చొప్పున పంపిణీ చేశారు. బస్తాలు రాని రైతులు నిరాశతో వెనుదిరిగారు.