Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్‌! | Operation Sindoor military action Reliance leads trademark rush this word | Sakshi
Sakshi News home page

Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్‌!

May 8 2025 1:18 PM | Updated on May 8 2025 3:51 PM

Operation Sindoor military action Reliance leads trademark rush this word

భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' సైనిక ఆపరేషన్‌ను ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పదంపై ట్రేడ్‌ మార్క్‌కోసం  కొన్నిసంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో    కుబేరుడు ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్   తొలి సంస్థగా నిలిచింది. ఈ మేరకు  బార్ అండ్ బెంచ్ నివేదించింది.

ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం (మే 7) ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ముందు 'ఆపరేషన్ సిందూర్' ను వర్క్ మార్క్ గా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది.విద్య మరియు వినోద సేవలను కవర్ చేసే క్లాస్ 41 కింద 'వస్తువులు మరియు సేవలు' కోసం ఈ పదాన్ని వాడుకునే హక్కు కోసం  రిజిస్ట్రేషన్ కోరింది.

అంబానీతోపాటు, మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ పదంరిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్ ,ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారు.

ఇదీ చదవండి: Thalassemia Day: బడికి వెళ్లే వయసులోనే..రక్త కన్నీటి గాథ..!

పహల్గామ్ ఉగ్రవాద దాడి,25 మంది భారతీయులు మరణించిన నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ కింద  మే 6-7 తేదీల మధ్య రాత్రి  పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్.  ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా వైమానిక దాడులు ప్రారంభించింది.  ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా  కేంద్రం ఈ మిషన్‌ను ఈ పేరు పెట్టింది. 

సైనిక కార్యకలాపాల పేర్లకు ఆటోమేటిక్ రక్షణ లేదు
భారతదేశంలో, 'ఆపరేషన్ సిందూర్' వంటి సైనిక కార్యకలాపాల పేర్లను ప్రభుత్వం స్వయం చాలకంగా రక్షించదు. రక్షణ మంత్రిత్వ శాఖ సాధారణంగా అటువంటి పదాలను నమోదు చేయదు లేదా వాటిని మేధో సంపత్తిగా పరిగణించదు. నిర్దిష్ట చట్టపరమైన రక్షణ లేకుండా, ఈ పేర్లను ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీలు ట్రేడ్‌మార్క్ దాఖలు ద్వారా క్లెయిమ్ చేయవచ్చని నివేదిక పేర్కొంది.

చట్టపరమైన అడ్డంకులు 
ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం ఈ పదం అందుబాటులో ఉన్నప్పటికీ, ట్రేడ్ మార్కుల చట్టం, 1999 కొన్ని కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించడానికి రిజిస్ట్రీకి అధికారం  ఉంది. సెక్షన్లు 9(2) మరియు 11 ప్రకారం, రిజిస్ట్రార్ తప్పుదారి పట్టించే, తప్పుడు ప్రభుత్వ అనుబంధాన్ని సూచించే లేదా ప్రజల మనోభావాలకు హాని కలిగించే ట్రేడ్‌మార్క్‌ను తిరస్కరించవచ్చు. అయితే, ప్రభుత్వం లేదా ప్రభావిత పార్టీ ద్వారా అధికారిక అభ్యంతరం లేవనెత్తకపోతే అటువంటి నిబంధనలను నమోదు చేయడంపై ఎటువంటి నిషేధం లేదు. మరి ఇది ఎవరికి దక్కనే భవిష్యత్తులో తేలనుంది. 

చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్‌ చేయొచ్చా.. సూపర్‌ ఐడియా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement