పాకిస్తాన్ ఓడలపై భారత్‌ నిషేధం | Centre Bans Pakistani Ships From Entering Indian Ports | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ ఓడలపై భారత్‌ నిషేధం

May 3 2025 1:22 PM | Updated on May 3 2025 1:37 PM

Centre Bans Pakistani Ships From Entering Indian Ports

ఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్‌ వరుస షాకులిస్తోంది. ఇవాళ పాకిస్తాన్ ఓడలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆ నోటిఫకేషన్‌లో పాకిస్తాన్ జెండా ఉన్న ఏ ఓడ భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించవద్దని ఆదేశించింది. భారత ఓడలేవి పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్ళొద్దని సూచించింది. భారత్ ఆస్తులను, కార్గో , మౌలిక సదుపాయాలను రక్షించే క్రమంలో ఓడరేవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.  ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. 

పాకిస్తాన్ విమానాలకు ఇప్పటికే గగనతలం నిషేధం విధించింది భారత్‌. తాజాగా సముద్ర మార్గాన్ని సైతం బ్యాన్‌ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా పాక్‌ అన్ని మార్గాల్లో నిషేధం విధిస్తూ అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నాల్ని భారత్‌ కొనసాగిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement