భారత్‌పై 100% సుంకాలు  | US Senators unveil bill for 100percent tariffs on India | Sakshi
Sakshi News home page

భారత్‌పై 100% సుంకాలు 

Jul 16 2026 6:25 AM | Updated on Jul 16 2026 6:25 AM

US Senators unveil bill for 100percent tariffs on India

బిల్లును ప్రతిపాదించిన అమెరికా సెనేటర్లు  

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్‌ సహా ఐదు దేశాలపై 100 శాతం సుంకాలు విధించాలని సూచిస్తూ అమెరికా సెనేటర్లు ఒక బిల్లును ప్రతిపాదించారు. దివంగత రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం మధ్యవర్తిత్వంతో రూపొందించిన ఈ బిల్లు రష్యా గ్యాస్‌ను కొనుగోలు చేసే 15 యూరోపియన్‌ దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు ఇస్తుంది. ఈ కొనుగోళ్లు వారి మొత్తం అవసరంలో ఒక చిన్న భాగం మాత్రమేనని బిల్లులో పేర్కొన్నారు.

 సదరు దేశాలు రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. 100 శాతం సుంకాల ప్రభావానికి గురయ్యే దేశాల్లో భారత్, చైనా, స్లొవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్‌ ఉన్నాయి. ఒకవేళ ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందితే మరొక దేశ యుద్ధ ప్రయత్నాలకు ఆర్థిక సహకారం అందించే దేశాలను శిక్షించే లక్ష్యంతో సుంకాలను ఒక భౌగోళిక రాజకీయ ఆయుధంగా ఉపయోగించడానికి చట్టసభ స్పష్టంగా అనుమతినివ్వడం ఇదే మొదటిసారి అవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement