నేడు ఇంగ్లండ్‌తో భారత్ రెండో వన్డే
సా. గం. 5:30 నుంచి సోనీ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
కార్డిఫ్: ఇంగ్లండ్ చేతిలో టి20ల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో భారత్ వన్డే సిరీస్ విజయంపై గురి పెట్టింది. మూడు మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన తొడ కండరాల గాయంతో గత మ్యాచ్‌లో అర్ధాంతరంగా తప్పుకున్న గిల్ కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడా లేదా అనేది మ్యాచ్‌కు ముందే తేలనుంది. అక్షర్, సుందర్ బ్యాటింగ్‌లోనూ తాము ఎంతో కీలకమో చూపించారు. ఇదే జోరును కొనసాగిస్తే మరో విజయం సాధించడం కష్టం కాకపోవచ్చు.
మరోవైపు ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో తడబాటు కనిపించింది. జో రూట్, డాసన్ ఆదుకోకపోయి ఉంటే గత మ్యాచ్‌లో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉండేది. బెతెల్, బట్లర్, జాక్స్ వన్డేకు అనుగుణంగా తమ ఆటను మార్చుకోలేపోయారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా పూర్తి స్థాయిలో సత్తా చాటితేనే ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో ఉంటుంది. ఆర్చర్ బౌలింగ్‌లో పదును కనిపించినా... ఇతర బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. వన్డేల్లో భారత్ చేతిలో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్... సొంత గడ్డపైనైనా సిరీస్‌ను కోల్పోరాదని పట్టుదలగా ఉంది.


