'రేపు రాత్రి నుంచే నరకం చూపిస్తాం'.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్ | Donald Trump rules out setting any deadline for Iran before bombing its bridge | Sakshi
Sakshi News home page

'రేపు రాత్రి నుంచే నరకం చూపిస్తాం'.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్

Jul 16 2026 2:30 AM | Updated on Jul 16 2026 5:02 AM

Donald Trump rules out setting any deadline for Iran before bombing its bridge

PC: X.com

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. శాంతి ఒప్పందం విఫలమయ్యాక ఇరాన్‌పై అమెరికా దాడులను ఉధృతం చేసింది. అందుకు ప్రతిగా  బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.  ఇరాన్ పద్ధతి మార్చుకుంటే మంచిది అని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

"నాకు డెడ్‌లైన్లు పెట్టడం నచ్చదు. కానీ అక్కడ ఏం జరుగుతుందో ఇరాన్‌కు బాగా తెలుసు. వారు సైలెంట్‌గా ఉంటే మంచిది. మేము రేపు రాత్రి ఇరాన్‌పై తీవ్రమైన దాడులు చేయబోతున్నాం. ఆ తర్వాత రోజు కూడా మా దాడులు కొనసాగుతాయి. 

వచ్చే వారం నుంచి పరిస్థితి చాలా దారుణంగా మారబోతుంది. మేము వారి పవర్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేయబోతున్నాం. వారు చర్చలకు రాకపోతే వాటన్నింటినీ కూల్చేస్తాం" అని ట్రంప్ బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement