కండక్టర్ క్యాష్ బ్యాగ్‌ను ప్రయాణికురాలు చోరీ చేసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. బీఎంటీసీలో ప్రయాణిస్తున్న మహిళ ..కండక్టర్ బ్యాగ్‌ను చాకచక్యంగా చోరీ చేసింది. దానిని తన వద్ద ఉన్న మరో బ్యాగులో వేసుకొని గప్‌చుప్‌గా బస్సు దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అయితే చోరీ దృశ్యాలను వీడియో తీసిన ఒక ప్రయాణికుడు డ్రైవర్‌కి విషయం తెలియజేసి డోర్ మూసివేయించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకొని ఆరా తీశారు. తొలుత బుకాయించిన ఆ మహిళ చివరకు తన వద్ద ఉన్న సంచిలోనుంచి కండక్టర్‌కు చెందిన బ్యాగు తీసి ఇచ్చింది. అనంతరం ఆమెను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు.ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
🚨 బీఎంటీసీ బస్సులో కలకలం.. కండక్టర్ టికెట్ బ్యాగ్ మాయం!
🔸 నగరంలోని బీఎంటీసీ బస్సు (KA-57 F 6331)లో కండక్టర్ టికెట్ బ్యాగ్ కనిపించకపోవడంతో బస్సును మధ్యలోనే నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
🔸 ప్రయాణికుల బ్యాగులు, సామాన్లను పోలీసులు తనిఖీ చేయగా టికెట్ బ్యాగ్ లభ్యమైంది.… pic.twitter.com/1FDA23U5sA— ముచ్చట్లు (@muchatlu_) July 15, 2026


