ముఖ్యమంత్రిని నెట్టిపడేసిన పోలీసులు | Jammu and Kashmir cops block Martyrs Day events | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిని నెట్టిపడేసిన పోలీసులు

Jul 14 2025 4:55 PM | Updated on Jul 14 2025 5:49 PM

Jammu and Kashmir cops block Martyrs Day events

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో జూలై 13న అమరవీరుల దినోత్సవం. అయితే అమరవీరలుకు నివాళులు అర్పించేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఎప్పటిలాగా ఇవాళ అక్కడ స్థానికులు అమర వీరుల స్థూపంగా భావించే మజార్-ఎ-షుహదా వద్ద నివాళులర్పించేందుకు ప్రయత్నించారు. గోడదూకేందుకు ప్రయత్నించగా.. గవర్నర్‌ ఆదేశాలతో అప్పటికే మొహరించిన పోలీసులు ఆయన్ను పక్కకు లాగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

అయితే, పోలీసుల తీరుపై సీఎం ఓమర్‌ అబ్ధుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఏ చట్టవిరుద్ధమైన పని చేయలేదు. వీళ్లు (పోలీసులు) మమ్మల్ని ఆపాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. ఇది స్వేచ్ఛా దేశమని చెబుతారు. కానీ వాళ్లు మమ్మల్ని బానిసలుగా భావిస్తున్నారు. మేము ప్రజలకు మాత్రమే బానిసలం. ఎవరికి బానిసలం కాదు’అని అన్నారు.

కాశ్మీర్ అమరవీరుల దినోత్సవం. బ్రిటీష్ ఇండియాలోని జమ్మూ కశ్మీర్ డోగ్రా దళాల చేతుల్లో 1931, జూలై 13 న  21 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పిస్తూ ప్రతి ఏడాది జులై 13న అధికారికంగా అమరవీరుల దినోత్సవం జరుగుతుంది. పబ్లిక్‌ హాలుడే. ప్రభుత్వం,ప్రతిపక్ష పార్టీలు.. అమర వీరుల స్థూపం వద్ద అధికారికంగా నివాళులర్పించేవి. సీఎం నేతృత్వంలో అధికారిక నివాళి కార్యక్రమం జరిగేది. జమ్మూ కాశ్మీర్ పోలీసు దళాలు సైతం ఇందులో పాల్గొనేవి.  

కానీ ఆగస్టు 5, 2019న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ మరుసటి ఏడాది నుంచి అంటే జూలై 2020లో ఈ సెలవు దినంతో పాటు అధికారిక నివాళులు రద్దయ్యాయి.

ఈ క్రమంలో ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు అమరవీరులకు నివాళులర్పించేందుకు ఎలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ సీఎం ఓమర్‌ అబ్దుల్లా నివాళులర్పించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. 

 

పోలీసులు బంకర్‌లు ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement