
భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. జమ్మూకాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి 'ఒమర్ అబ్దుల్లా' ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
గత నాలుగు రోజుల్లో పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో 19 మంది గ్రామస్తులు మరణించారు. బుధవారం పూంచ్‌లో 12 మంది పౌరులు మరణించగా.. శుక్రవారం ఉరి, పూంచ్‌లో మరో ఇద్దరు మరణించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారితో సహా మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది. మా ప్రభుత్వం మా ప్రజల కష్టాలను తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం షేర్ చేసిన పోస్ట్‌లో.. ప్రియమైన వ్యక్తిని ఎప్పటికీ భర్తీ చేయలేము. కానీ ఈ వారి కుటుంబాలకు మద్దతుగా, మా సంఘీభావానికి చిహ్నంగా, మరణించిన వారందరి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు పేర్కొంది.