Mock drills: భారత్‌లో మాక్‌ డ్రిల్‌.. 1971భారత్-పాక్‌ యుద్ధ సమయంలో | Mock drills across states in India on May 7 | Sakshi
Sakshi News home page

Mock drills: భారత్‌లో మాక్‌ డ్రిల్‌.. 1971భారత్-పాక్‌ యుద్ధ సమయంలో

May 5 2025 7:52 PM | Updated on May 5 2025 8:08 PM

Mock drills across states in India on May 7

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో  సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ జరిగింది. అదే సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది.  

సోమవారం ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్,‌ హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.

అయితే, మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. 


Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.

Following measures will be undertaken

1.Operationalization of Air Raid Warning Sirens
2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A



శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు,  విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు  చర్యల సన్నద్ధత ఉండనుంది.  

గత ఆదివారం ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement