కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం.. సొంత పార్టీపైనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు
కేటీఆర్ పేరు ప్రస్తావన లేకుండా విమర్శలు గుప్పించిన కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ట్వీట్లకే పరిమితం కావొద్దంటూ ఘాటు సూచన
పార్టీ సగం పనులు నేనే చేస్తున్నా. అంతర్గత విషయాలు బయట మాట్లాడొద్దని చెప్పినవారికి పార్టీ నడిపించే సత్తా లేదని వ్యాఖ్య.
లేఖ ఎందుకు రాశావని అంటున్నారు?. ఇప్పటిదాకా వంద లేఖలు రాశా. అంతర్గత విషయాలు బయట మాట్లాడొద్దని అంటున్నారు. పార్టీ ఫోరమ్‌లో ఏముందని మాట్లాడటానికి. అందుకే బయట మాట్లాడుతున్నా.
బీఆర్‌ఎస్‌ను బీజేపీ చేతిలో పెట్టాలనుకుంటున్నారని, 101శాతం బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపణ
జైల్లో ఉండగా బీజేపీ విలీన ప్రతిపాదనను వ్యతిరేకించా. నేను వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి తనను పార్టీకి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని కవిత ఫైర్
కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారమూ ఖండించిన కవిత.. అది మునిగిపోయే నావ అంటూ ఎద్దేవా. తన పార్టీ బీఆర్‌ఎస్ అని స్పష్టీకరణ
25 ఏళ్లుగా కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నారని.. ఈ సారి బయటకు ఎలా వచ్చిందోనని కవిత ప్రశ్న. లీకు వీరులను బయటపెట్టమంటే.. గ్రీకువీరుల్లా తనపై దాడిచేస్తున్నారని ఎద్దేవా
ఇంటి ఆడబిడ్డను డబ్బులిచ్చి మరీ తిట్టిస్తున్నారని ఆవేదన. కేసీఆర్‌లాగే తనకు తిక్క ఉందని.. తనతో పెట్టుకోవద్దని వార్నింగ్
కేసీఆర్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని, బీఆర్‌ఎస్‌కు ఆయనే లీడర్ అని, త్వరలోనే ఆయన్ని కలుస్తానని కవిత ప్రకటన


