
ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి, ‘స్పిరిట్’ మూవీ, బాలీవుడ్ స్టార్‌హీరోయిన్ దీపికా పదుకొణే మధ్య నడుస్తున్న వివాదం నేపథ్యంలో దీపికా పదుకొనే ఇన్‌స్టా లుక్ వైరల్‌గా మారింది. బ్రైట్ రెడ్ డ్రెస్‌లో దీపికా ఆశ్చర్యపరిచింది. డైమండ్ ఆభరణాలతో స్పెషల్ లుక్‌లో అదరగొట్టేసింది. దీంతో అభిమానులు కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ప్రపంచ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్ ’ ఈవెంట్‌లో స్టాక్‌హోమ్‌లో దీపికా పదుకొణే ఎరుపు రంగు అవతారంలో అబ్బురపరిచింది. ఈ బ్రాండ్ అంబాసిడర్ అయిన స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో అందంగా మెరిసింది. ఆషి స్టూడియో రూపొందించిన ఆఫ్-షోల్డర్ రెడ్ మొహైర్ గౌను, కార్టియర్ ఆభరణాలతో ధరించింది. మదర్-ఆఫ్-ఆల్ ఫ్యాషన్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. తన లుక్‌కు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించేలా ధరించిన ప్రిన్సెస్ కోడెడ్ డైమండ్స్ , నీలమణి పొదిగిన నెక్లెస్ , సాలిటైర్ స్టడ్ చెవిపోగులు మరింత ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

అంతేనా షోల్డర్ లెంత్ జుట్టును సొగసైన సైడ్ పార్టెడ్ హెయిర్ జెల్ లాడెన్ వెల్ కెంప్ట్ లుక్ లో స్టైల్ చేసింది. తన రూపానికి తగినట్టు మస్కారా, న్యూడ్ బ్రౌన్ లిప్ ఆయిల్‌మేకప్‌తో గ్లామర్ లుక్‌ను సంపూర్ణం చేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమె లుక్‌కి ఫిదా అవడం మాత్రమే కాదు.. ‘‘డోంట్ వర్రీ..దీపికా మా మద్దతు నీకే.. చాలా అందంగా ఉన్నావ్’’ అంటూ కమెంట్ చేశారు. అంతేకాదు.. స్పిరిట్ ఫ్లాప్.. పక్కా అంటూ మరో యూజర్ కమెంట్ చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ , యూట్యూబ్ సీఈవోకి గూగుల్ భారీ ఆఫర్
కాగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో 'స్పిరిట్' అనే మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో తొలుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేనును ఎంపిక చేశారు. కానీ వివాదాల నేపథ్యంలో ఆమెను ఈ ప్రాజెక్ట్‌నుంచి తొలగించారు. దీపిక స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కనిపించనుంది.