
భారత సంతతికి చెందిన సీఈవో, యూ ట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ (Neal Mohan Youtube CEO) ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రముఖ సెర్చ్ ఇంజీన్ గూగుల్‌ను వీడి ట్విటర్‌లో చేరకుండా ఉండేందుకు గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో నీల్ మోహన్ తన అనుభవాలను, విశేషాలను పంచుకున్నారు. Zerodha సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఇటీవల తన 'People by WTF' పాడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్‌లో నీల్ మోహన్‌తో సంభాషించారు. రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం నుండి ప్లాట్‌ఫామ్ అల్గోరిథంను ఛేదించే చిట్కాల వరకు ఇద్దరూ అనేక అంశాలపై చర్చించారు.
సుదీర్ఘకాలంగా యూట్యూబ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా సేవలు అందించి 2023నుంచి గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం సీఈవోగా ఉన్న ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్విటర్ (ఎక్స్)లో చేరకుండా ఉండేందుకు 2011లో 15 ఏళ్ల క్రితం గూగుల్ మీకు 100 మిలియన్ డాలర్లు (దాదాపు 855 కోట్ల రూపాయలు) చెల్లించిదటగా అని ప్రశ్నించాడు నిఖిల్ కామత్ వాదనను ఖండించకపోవడంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే 2011 టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం అనేక సంవత్సరాలు కొనసాగే పరిమిత స్టాక్ యూనిట్ల రూపంలో , గూగుల్ ఆఫర్ ఇచ్చిందట నీల్‌మోహన్‌కు. అలా నీల్ మోహన్‌కు దూకుడు కళ్లెం వేసిందని తెలిపింది. అప్పటికే గూగుల్ ఉత్పత్తి అభివృద్ధి వ్యూహంలో కీలకంగా ఉన్న నీల్‌మోహన్‌ను వదులుకోవడానికి ఇష్టపడని గూగుల్ యూట్యూబ్ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చర్య దీర్ఘకాలంలో గూగుల్‌కు మంచి ఫలితాలను అందించింది. అంతేకాదో సుందర్ పిచాయ్‌ను బోర్డులోకి తీసుకురావడానికి ట్విటర్ ప్రయత్నించిందట. దీంతో పిచాయ్‌కి కూడా 50 మిలియన్ల స్టాక్ గ్రాంట్ ఆఫర్ ఇచ్చింది గూగుల్.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ,స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఆ తరువాత నీల్ మోహన్, ఆండర్సన్ కన్సల్టింగ్ (ఇప్పుడు యాక్సెంచర్)లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడినుంచి అంచలంచెలుగా ఎదుగుతూ చివరికి బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తరువాత . 2007లో గూగుల్ డబుల్ క్లిక్‌ను 3.1 బిలియన్‌డాలర్లకు కొనుగోలు చేయడంతో గూగుల్ యాడ్స్ విభాగంలో ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ అయ్యారు. 2023లో సుసాన్ వోజ్సికి తర్వాత నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితులయ్యారు.
ఇదీ చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్‌పై ఫ్యాన్ కామెంట్ వైరల్
అప్పట్లో హిందీ రాదు, తలచుకుంటే నవ్వొస్తుంది...
తన తండ్రి ఇండియాలో ఐఐటీలో చదవి పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లారని మోహన్ తెలిపారు. తన తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా ఉన్నప్పుడే తాను పుట్టానని, తన బాల్యంలో ఎక్కువ భాగం అమెరికాలో గడిచిందని చెప్పుకొచ్చారు. అయితే 1986లో భారతదేశానికి తిరిగి వచ్చా.. ఆ సమయంలో లక్నోలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో చేరినపుడు చాలా భయం వేసింది. ఎందుకంటే నాకు హిందీమీద అంత పట్టు లేదు, ఏడో తరగతిలో అదో పెద్ద సవాల్ అంటూ గుర్తు చేసుకున్నారు.
చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్