ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన, వ్యక్తిగత కమ్యూనికేషన్‌కు కీలకంగా ఉన్న ఆన్‌లైన్ వీడియో కాలింగ్, మీటింగ్ ప్లాట్‌ఫామ్ గూగుల్ మీట్ (Google Meet) సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. బుధవారం భారతదేశంలో చాలా మంది వినియోగదారులు గూగుల్ మీట్ సేవలు సరిగా పని చేయడంలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా రిమోట్ వర్క్, ఆన్‌లైన్ సమావేశాల్లో పాల్గొనే వినియోగదారులు ఈ అంతరాయం వల్ల సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
ఆన్‌లైస్ సేవల అవుటేజ్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్ డిటెక్టర్ (Downdetector) ప్రకారం, మధ్యాహ్నం 12:29 గంటల వరకు భారతదేశంలో కనీసం 1,760 మంది వినియోగదారులు గూగుల్ మీట్‌తో సమస్యల ఎదుర్కొన్నట్లు చెప్పారు. చాలా మంది వినియోగదారులు వెబ్‌సైట్ ద్వారా ముఖ్యమైన సమావేశాల్లో జాయిన్ అవ్వలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎర్రర్ ఇదే..
ఆన్‌లైన్ కాల్స్‌లో చేరడానికి ప్రయత్నించిన వినియోగదారులకు స్క్రీన్‌పై ఒక ఎర్రర్ మెసేజ్ దర్శనమిచ్చింది. ‘502. దిస్ ఈస్ యాన్ ఎర్రర్. మీ రెక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయడానికి దయచేసి 30 సెకన్లలో మళ్లీ ప్రయత్నించండి. మాకు తెలిసింది అంతే’ అనే మెసేజ్ చూపించింది.
నెటిజన్ల స్పందన
గూగుల్ మీట్ అంతరాయంపై నెజినట్లు ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించారు. ‘పని చేయడానికి ఎంతో ఆశగా ఉన్న నాకు గూగుల్ మీట్ చుక్కలు చూపించింది’ అని ఒక నెటిజన్ రాశారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. ‘మా సంస్థలో గూగుల్ మీట్ అందరికీ డౌన్ అయింది’ అని రాశారు. కొంతమంది యూజర్లు మాత్రం టీమ్ సభ్యుల మధ్య సమస్యలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపారు. ‘గూగుల్ మీట్? నాకు సరిగానే ఉంది. కానీ మా బృందంలో ఇతర సభ్యులు సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు’ అని రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: 1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!


