ప్రస్తుతం ఉపయోగిస్తున్న జీమెయిల్ అకౌంట్‌లోని డేటాను కోల్పోకుండానే, ప్రైమరీ ఖాతాకి కొత్త ఐడీని క్రియేట్ చేసుకునే వీలు కలి్పస్తూ టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచరు కారణంగా యూజరు కొత్త జీమెయిల్ ఐడీకి మారినా, పాత ఖాతాలో సేవ్ చేసుకున్న ఫొటోలు, మెసేజీలు, ఈమెయిల్స్ లాంటి డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అధికారిక సపోర్ట్ పేజీలో పేర్కొంది.
యూజర్లు తమ పాత లేదా కొత్త ఈమెయిల్ అడ్రెస్‌తో జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్‌లాంటి గూగుల్ సర్వీసులకు సైన్ ఇన్ చేయొచ్చని వివరించింది. ఇలా ఒకసారి కొత్త జీమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకున్నాక మళ్లీ 12 నెలల వరకు మరో కొత్త ఐడీని క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. పాత అడ్రెస్‌ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.
పర్సనల్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ కింద గూగుల్ అకౌంట్ సెటింగ్స్‌లోని ఈమెయిల్ సెక్షన్‌లో ఈ ఫీచరు లభ్యతను యూజర్లు చెక్ చేసుకోవచ్చు. డేటా భద్రతకు గ్యారంటీ ఉన్నప్పటికీ, కొన్ని యాప్ సెట్టింగ్‌లు మారిపోయే అవకాశం ఉన్నందున మార్పులు, చేర్పులను చేపట్టడానికి ముందు యూజర్లు తమ సమాచారాన్ని బ్యాకప్ తీసుకోవాలంటూ గూగుల్ సూచించింది.
ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం


