breaking news
mail id
-
వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్!
అది టోక్యో వీధి.. మధ్యాహ్నపు ఎండ.. నిత్యం కిటకిటలాడే ఆ నగరంలో ఒక వృద్ధుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతని కళ్లలో ఒక తరం కిందటి జ్ఞాపకం మెరుస్తోంది. సరిగ్గా 48 ఏళ్ల క్రితం విడిపోయిన తన ప్రాణ మిత్రుడు కనిపిస్తాడా? అసలు ఆ పాత ఈమెయిల్ చిరునామా ఇంకా పని చేస్తోందా?అమ్మ దాచిన అపురూప నిధికథ అమెరికాలోని నార్త్ కరోలినాలో మొదలైంది. వాల్టర్ అనే వ్యక్తి.. తన తల్లి మరణానంతరం ఆమె పాత వస్తువులను సర్దుతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. చనిపోవడానికి ముందు ఆమె రాసుకున్న పాత కాగితాల మధ్య.. ఒక చిరునామా, ఒక పాత ఈమె యిల్ ఐడీ కనిపించింది. అది 48 ఏళ్ల క్రితం తన ఇంట్లో ఎక్సే్ఛంజ్ స్టూడెంట్‌గా ఉన్న జపాన్ మిత్రుడు కజుహికోది. అతను వాల్టర్ ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అలా వాల్టర్, కజుహికోలు చిన్నప్పుడే మంచి మిత్రులయ్యారు. వాల్టర్ తల్లికి కజుహికో అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి సొంత కొడుకులా ఉండేవాడు. అందుకే ఆమె పాత కాగితాల్లో కజుహికో వివరాలను, ఆఖరికి అతని పాత ఈమెయిల్ చిరునామాను కూడా భద్రంగా రాసి పెట్టుకుంది.ఆఖరి ప్రయత్నం ఫలించిందినిజానికి 48 ఏళ్ల తర్వాత ఆ ఈమెయిల్ పని చేస్తుందని ఎవరూ అనుకోరు. కానీ జపాన్ వెళ్లే విమానం ఎక్కడానికి కొద్ది నిమిషాల ముందు, వాల్టర్ ఒక చిన్న సాహసం చేశాడు. ‘ఆ ఈమెయిల్ ఐడీ ఇప్పుడు పనిచేస్తుందో లేదో.. ఆ మిత్రుడు బతికే ఉన్నాడో లేదో’.. అన్న సందేహంతోనే ఒక మెయిల్ పంపాడు. విమానం దిగేసరికి అద్భుతం జరిగింది.. నాలుగు దశాబ్దాల నిశ్శబ్దాన్ని బద్ధలు కొడుతూ.. అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. జపాన్‌లో ఉన్న కజుహికో స్పందించాడు. కానీ వారి మధ్య భాష సమస్య ఎదురైంది. వాల్టర్ మిత్రుని భార్య నోబుకో మధ్యవర్తిగా మారి, వారిద్దరి మధ్య సందేశాలను అనువదించింది. చివరికి టోక్యోలో ఒక లంచ్ మీటింగ్ ఖరారైంది.కన్నీటి ఆలింగనంనిర్దేశించిన ప్రదేశంలో ఇద్దరూ కలుసు కున్నారు. 48 ఏళ్ల క్రితం యవ్వనంలో చూ సుకున్న ఆ ఇద్దరి కనులు.. ఇప్పుడు ముడతలు పడ్డ ముఖాల్లో ఒకరినొ కరిని గుర్తు పట్టా యి. ఇంకేమీ మా ట్లాడలేదు.. ఒకరి నొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ ఆలింగనంలో అర్ధ శతాబ్దపు ఎడబాటు, ఆనందం, కన్నీళ్లు అన్నీ కలిసిపోయాయి. ఈ దృశ్యం చూసిన వారందరి కనులు చెమర్చాయి.స్నేహానికి ’ఎక్స్పైరీ డేట్’ లేదు!వాల్టర్ కుమార్తె మెరెడిత్ డీన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వారి ఆలింగనం చూసి సోషల్ మీడియా ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. చితికిపోయిన కాగితం మీద దొరికిన అక్షరం.. విడిపోయిన ఇద్దరు మిత్రులను కలిపింది. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, స్వచ్ఛమైన స్నేహానుబంధం ఏనాటికీ వాడిపోదని ఈ సంఘటన నిరూపించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు
ప్రస్తుతం ఉపయోగిస్తున్న జీమెయిల్ అకౌంట్లోని డేటాను కోల్పోకుండానే, ప్రైమరీ ఖాతాకి కొత్త ఐడీని క్రియేట్ చేసుకునే వీలు కలి్పస్తూ టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచరు కారణంగా యూజరు కొత్త జీమెయిల్ ఐడీకి మారినా, పాత ఖాతాలో సేవ్ చేసుకున్న ఫొటోలు, మెసేజీలు, ఈమెయిల్స్ లాంటి డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అధికారిక సపోర్ట్ పేజీలో పేర్కొంది. యూజర్లు తమ పాత లేదా కొత్త ఈమెయిల్ అడ్రెస్‌తో జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్‌లాంటి గూగుల్ సర్వీసులకు సైన్ ఇన్ చేయొచ్చని వివరించింది. ఇలా ఒకసారి కొత్త జీమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకున్నాక మళ్లీ 12 నెలల వరకు మరో కొత్త ఐడీని క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. పాత అడ్రెస్‌ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ కింద గూగుల్ అకౌంట్ సెటింగ్స్‌లోని ఈమెయిల్ సెక్షన్లో ఈ ఫీచరు లభ్యతను యూజర్లు చెక్ చేసుకోవచ్చు. డేటా భద్రతకు గ్యారంటీ ఉన్నప్పటికీ, కొన్ని యాప్ సెట్టింగ్‌లు మారిపోయే అవకాశం ఉన్నందున మార్పులు, చేర్పులను చేపట్టడానికి ముందు యూజర్లు తమ సమాచారాన్ని బ్యాకప్ తీసుకోవాలంటూ గూగుల్ సూచించింది.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
మెయిల్ ఐడీ నచ్చలేదా? మార్చుకుందురులే..!
మనలో చాలా మందికి ఈమెయిల్ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ మెయిల్ ఐడీల విషయంలో ఎక్కువ మందికి అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం వీటిని తెరిచేటప్పుడు సిస్టమ్ ఆటోమెటిక్‌గా సూచించిన ఏదో ఒక ఐడీని ఈమెయిల్ అడ్రెస్‌గా సెట్ చేసుకుని ఉంటారు. కానీ దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పుడు అరే ఈ మెయిల్ ఐడీ అంత బాగా లేదే.. దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు.. అనుకుంటుంటారు.ఇప్పుడా అవకాశాన్ని గూగల్ కల్పించబోతోంది. టెక్ దిగ్గజం రాబోయే సిస్టమ్ మార్పును వివరించే హిందీ భాష సపోర్ట్ డాక్యుమెంటేషన్‌ను ఇటీవల అప్డేట్ చేసింది. అందులో జీమెయిల్ అడ్రస్‌లను మార్చుకునే వెసులుబాటు గురించి పేర్కొంది.ప్రసిద్ద ఫోర్బ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ జీమెయిల్ అడ్రెస్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇందుకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఇలా మెయిల్ ఐడీ మార్చుకోవడానికి ఏడాదికి ఒక్కసారి.. మొత్తంగా మూడు సార్లు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంతకుముందున్న మెయిల్ అడ్రస్ కూడా అలియాస్‌గా కొనసాగుతుంది. అంటే దానికి వచ్చే మెయిల్స్ అలాగే వస్తుంటాయి. ఇక ఖాతా డేటా అంటే ఫోటోలు, మెసేజ్‌లు, ఇమెయిల్‌లు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.కాగా ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్‌కు థర్డ్ పార్టీ ఈమెయిల్ చిరునామాలతో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఖాతా ఈమెయిల్ మార్పులను అనుమతిస్తోంది. కానీ జీమెయిల్ అడ్రెస్ల మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్ అందిస్తున్న కొత్త ఫీచర్‌ను సోషల్ మీడియా యూజర్లు స్వాగతిస్తున్నారు. -
నేను జోహో ఈ-మెయిల్‌కు స్విచ్ అయ్యా: అమిత్ షా
న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా కోసం పదే పదే పిలుపునిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ-మెయిల్ అడ్రస్ మారింది. ఇక నుంచి అమిత్ షా ఈ-మెయిల్ ఐడి ‘జోహో మెయిల్’. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘ఎక్స్’ ఖాతాలో స్సష్టం చేశారు. తాను జోహో మెయిల్‌కు స్విచ్ అయినట్లు విషయాన్నిఅమిత్ షా పేర్కొన్నారు. ఇక నుంచి తన మెయిల్ ఐడీ amitshah.bjp @ http://zohomail.in అని ఆయన తెలిపారు.Hello everyone,I have switched to Zoho Mail. Kindly note the change in my email address.My new email address is amitshah.bjp @ https://t.co/32C314L8Ct. For future correspondence via mail, kindly use this address.Thank you for your kind attention to this matter.— Amit Shah (@AmitShah) October 8, 2025 Zoho Mail అనేది జోహో కార్సోరేషన్ అందించే ఒక ప్రొఫెషనల్ ఇమెయిల్ సేవ. ఇది వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు అనుకూలంగా రూపొందించబడింది, ముఖ్యంగా అధిక భద్రత, ప్రైవసీ, మరియు వినియోగదారులకు అనుకూలమైన ఇంటర్ఫేస్ కలిగి ఉంటుంది. జోహో కార్సోరేషన్ అనేది భారతదేశానికి చెందిన కంపెనీ, ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉంది. -
ఈ-సేవ మెయిల్ ఐడీ హ్యాకింగ్‌పై కేసు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఈసేవ మెయిల్ ఐడీ హ్యాక్ ఘటనపై సీసీఎస్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈసేవ మెయిల్ ఐడీ హ్యాక్ చేసిన నైజీరియన్లు డబ్బును వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని యాక్సిస్ బ్యాంక్‌కు మెయిల్ పెట్టారు. దీంతో బ్యాంక్ అధికారులు ఆ ఖాతాలో కోటికి పైగా రూపాయలను బదిలీ చేశారు. వెంటనే నైజీరియన్లు దాదాపు రూ.80 లక్షల వరకు డ్రా చేసుకున్నారు. దీనిపై ఈసేవ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. -
అటెన్షన్ డైవర్ట్ గ్యాంగ్‌ల హాల్ చల్
-
రియాజ్ @ ‘లవ్లీ హంక్’
సాక్షి, సిటీబ్యూరో: బీహార్‌లోని భారత్-నేపాల్ సరిహద్దుల్లో చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కీలక ఉగ్రవాది యాసీన్ భత్కల్ విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో పాటు కేంద్ర నిఘాః వర్గాలు వేగవంతం చేశాయి. యాసీన్‌తో పాటు తబ్రేజ్‌ను ఢిల్లీ తరలించిన ఎన్ఐఏ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో అరెస్టు చూపించింది. కోర్టు అనుమతితో 12 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. విచారణలో ఎన్ఐఏతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) పాలుపంచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా యాసీన్ భత్కల్, తబ్రేజ్‌లు సృష్టించిన విధ్వంసాలు, వీరికి సహకరించిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వీటన్నింటికీ మించి ఇప్పటికీ పరారీలోనే ఉన్న, గోకుల్‌చాట్, లుంబినీపార్క్, దిల్సుఖ్నగర్ పేలుళ్లలో వాంటెడ్ ఐఎం కో-ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌ల సమాచారం సేకరించడంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన కీలక సమాచారం లభ్యమైంది. రియాజ్, ఇక్బాల్‌లు పాక్ నిఘా సంస్థ(ఐఎస్ఐ) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా కనుసన్నల్లో పని చేస్తున్నారని, గతేడాది నుంచి కరాచీలోనే ఉంటున్నారని యాసీన్ బయటపెట్టాడు. అంతకు ముందు షార్జాలో ఉన్నారని, అయితే, అమెరికా ఐఎంను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం, ఇంటర్‌పోల్ వేట ముమ్మరం కావడంతో ఐఎస్ఐ ఇరువురినీ కరాచీకి రప్పించిందని చెప్పాడు. కరాచీలోని మిలటరీ బేస్‌కు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ ప్రాంతంలో వీరి షెల్టర్ ఉందని, అక్కడి ఫేజ్-4 లో ఉన్న డిఫెన్స్ హౌసింగ్ కాలనీలో వీరిద్దరి కోసం ఐఎస్ఐ ఓ సేఫ్‌హౌస్‌ను కేటాయించిందన్నాడు. పాక్ ఆర్మీ వీరికి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోందని యాసీన్ పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న తమ అనుచరులు, స్లీపర్ సెల్స్‌తో రియాజ్ భత్కల్ ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడని యాసీన్ బయటపెట్టాడు. ‘లవ్లీహంక్ 34’ పేరుతో మెయిల్ ఐడీని సృష్టించి గతేడాది నుంచి దాని ద్వారా అటు ఐఎస్ఐ, ఎల్ఈటీ సంబంధీకులతో పాటు అనుచరులతోనూ సంప్రదింపులు జరుపుతున్నాడని యాసీన్ వెల్లడించాడు. ఐఎం ఇప్పటి వరకు విధ్వంసాలకు వినియోగించిన బాంబుల్లో అమోనియం నైట్రేట్‌నే పేలుడు పదార్థంగా వినియోగించింది. దీన్ని యాసీన్ భత్కల్ కర్ణాటకలో సేకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2007లో అక్కడి కుడేర్‌గుండి నుంచి ట్రక్కు అమోనియంను ఓ రహస్య ప్రాంతానికి రవాణా చేశాడు. దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు 30 పేలుళ్లలో దీన్నే వాడాడు. ఈ పేలుడు పదార్థం సేకరణ, రవాణా, భద్రపరచడం వంటి అంశాలపై నిఘా వర్గాలు యాసీన్‌ను ప్రశ్నిస్తున్నాయి.


