నేను జోహో ఈ-మెయిల్‌కు స్విచ్‌ అయ్యా: అమిత్‌ షా | Amit Shah Swithces To Zoho Mail | Sakshi
Sakshi News home page

నేను జోహో ఈ-మెయిల్‌కు స్విచ్‌ అయ్యా: అమిత్‌ షా

Oct 8 2025 7:36 PM | Updated on Oct 8 2025 9:28 PM

Amit Shah Swithces To Zoho Mail

న్యూఢిల్లీ: మేకిన్‌ ఇండియా కోసం పదే పదే పిలుపునిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ-మెయిల్‌ అడ్రస్‌ మారింది. 

ఇక నుంచి అమిత్‌ షా ఈ-మెయిల్‌ ఐడి ‘జోహో మెయిల్‌’. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘ఎక్స్‌’ ఖాతాలో స్సష్టం చేశారు. తాను జోహో మెయిల్‌కు స్విచ్‌ అయినట్లు విషయాన్నిఅమిత్‌ షా పేర్కొన్నారు. ఇక నుంచి తన మెయిల్‌ ఐడీ amitshah.bjp @ http://zohomail.in అని ఆయన తెలిపారు.

 Zoho Mail అనేది జోహో కార్సోరేషన్‌ అందించే ఒక ప్రొఫెషనల్ ఇమెయిల్ సేవ. ఇది వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు అనుకూలంగా రూపొందించబడింది, ముఖ్యంగా అధిక భద్రత, ప్రైవసీ, మరియు వినియోగదారులకు అనుకూలమైన ఇంటర్‌ఫేస్ కలిగి ఉంటుంది.

 జోహో కార్సోరేషన్‌ అనేది భారతదేశానికి చెందిన కంపెనీ, ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement