
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్‌లైన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్‌లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్‌లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.