అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది.
గతేడాది అక్కినేని నాగచైతన్య-శోభితను పెళ్లాడారు.
ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.
తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడనున్నారు.
జూన్ 6న జైనాబ్ మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే పెళ్లి తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.


