కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్‌ రెడ్డి వంగా కౌంటర్‌ | Sandeep Reddy Vanga Strong Reaction On Bollywood Actress Dirty PR team Games And Slammed Her | Sakshi
Sakshi News home page

కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్‌ రెడ్డి వంగా కౌంటర్‌

May 27 2025 8:18 AM | Updated on May 27 2025 3:41 PM

Sandeep Reddy Vanga Strong Reaction Bollywood Actress PR team

'యానిమల్‌' సినిమా తర్వాత బాలీవుడ్‌లో  దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్థాయి పెరిగిపోయింది. త్వరలో స్పిరిట్‌ సినిమాతో రానున్నాడు. రీసెంట్‌గా ప్రభాస్‌ సరసన అందులో నటించబోయే హీరోయిన్‌ను కూడా పరిచయం చేశాడు. అయితే, తాజాగా బాలీవుడ్‌ పీఆర్‌ టీమ్‌ను ఉద్దేశించి ఆయనొక సంచలన ట్వీట్‌ చేశారు. ఆయన పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేకైపోతారు. ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి సరైన నిద్ర కూడా పట్టదు. టాలెంట్‌ ఉంటే ఎవరికీ తల వంచాల్సిన పనిలేదని బాలీవుడ్‌కు రుచి చూపించిన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన కబీర్‌ సింగ్‌, యానిమల్‌ సినిమాలపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఎలాంటి బెరుకు లేకుండా సింగిల్‌గానే ఎదుర్కొని తానేంటో బాలీవుడ్‌కు చూపించాడు. ఇప్పుడు తాజాగా మరోసారి తనదైన స్టైల్లో పంచ్‌ ఇచ్చాడు.

సందీప్ రెడ్డి కొత్త సినిమా ‘స్పిరిట్’ త్వరలో ప్రారంభం కానుంది. అయితే, బాలీవుడ్ పీఆర్‌ టీమ్స్‌ ఆయన్ను అప్పుడే టార్గెట్‌ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం హీరోయిన్‌గా దీపికా పదుకునే( Deepika Padukone) ఎంపిక అయిందని వార్తలు వచ్చాయి. కానీ, ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వైరల్‌ అయిన వెంటనే బాలీవుడ్‌ మీడియా రంగంలోకి దిగింది. సందీప్‌ను టార్గెట్‌ చేస్తూ.. బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు మొదలయ్యాయి. సందీప్‌ పెట్టిన కండిషన్లకు దీపికా ఒప్పుకోలేదని, మితి మీరిని గ్లామర్‌ సీన్లు ఉండటం వల్లే ఆమె తప్పుకున్నట్లు అక్కడి మీడియా ప్రచురించింది. కథలో ఎక్కువగా 'ఎ' రేటెడ్ సీన్లు ఉన్నాయని, అవి నచ్చకనే స్పిరిట్‌ సినిమా నుంచి ఆమె తప్పుకుందని కథనాలు రాశారు. సందీప్‌కు సినిమాలు తీయడం చేతకాదంటూ.. అతనొక అన్ ప్రొఫెషనల్ డైరెక్టర్‌ వంటి స్టోరీస్ ప్రచురించారు. వాళ్ల పీఆర్‌ స్టంట్స్‌కు సందీప్‌ బెదిరిపోయే రకం కాదు. పరోక్షంగా దీపికా పదుకొనేకు కూడా గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు.

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

ఇదే మీ ఫెమినిజమా..?
దర్శకుడిగా కొద్దిరోజుల క్రితం ప్రముఖ హీరోయిన్‌కు నేను కథ చెప్పాను. అలా చేశానంటే అది పూర్తి నమ్మకంతోనే అని గుర్తించాలి.  కానీ, వాళ్లు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కథను బయటకు చెప్పిన ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. నటీనటులకు మేము స్టోరీని చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదనే అనధికారిక అగ్రిమెంట్‌ ఉన్నట్లు లెక్క.  దానిని కూడా ఆ నటి ఉల్లంఘించారు. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా..? మీ స్త్రీ వాదం దీనినే సూచిస్తుందా..? ఒక యంగ్‌ యాక్టర్‌ను తక్కువ చేసి మీ పీఆర్‌ టీమ్‌ ప్రస్తావిస్తుంది. ఫెమినిజం అంటే ఇదేనా..?

 ఒక సినిమా దర్శకుడిగా కథ రాసుకునేందుకు  నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను.  నాకు, సినిమానే ప్రతిదీ. మీరు ఎప్పిటికీ దానిని పొందలేరు. నా సినిమా మొత్తం కథను మీరు లీక్‌ చేసినా నాకు పోయేదేమీ లేదు.' అని డర్టీ పీఆర్ గేమ్స్ #dirtyPRgames అనే  హ్యాష్ ట్యాగ్‌ను సందీప్‌ జోడించాడు. దీపికా పదుకొనే గురించే సందీప్‌ ఈ ట్వీట్‌ చేశాడని నెటిజన్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. అందుకే ఆమె ఫోటోను సందీప్‌ కామెంట్‌ బాక్స్‌లో షేర్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement