
ప్రపంచ పోషకాహార దినోత్సవం 2025 (World Nutrition Day 2025) మన రోజువారీ భోజనంలో సరళమైన, స్థిరమైన మార్పులు చేయడం ద్వారా, మన శరీరానికి సరైన మార్గంలో పోషకాలు అందుతాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, ప్రోబయాటిక్స్ ఇలా అన్ని రకాలుగా పుష్కలంగా రెయిన్‌బోలా రంగుల మయమైన ఆహారం మన జీవితాన్ని కూడా ఆనందకరంగా మారుస్తుంది.
ప్రతి సంవత్సరం మే 28న, ప్రపంచ పోషకాహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు, సమతుల్య ఆహారాల ప్రాముఖ్యత అన్ని రకాల పోషకాహార లోపాలను పరిష్కరించాల్సిన ఆవశక్యతను గుర్తించడే దీని ప్రాముఖ్యత. పోషకాహార లోపంఅనేక అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉంటూ శరీరానికి మేలు చేసే స్థానిక, కాలానుగుణ ఆహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది.
సమతుల ఆహారం అంటే ఏమిటి?
సమతుల్య ఆహారం అంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తగిన మోతాదులో అందించే ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు వంటి అన్ని పోషకాలు సమంగా ఉంటాయి. మారుతున్న జీవన పరిస్థితులు, ఆహార అలవాట్లు అనేక అనర్థాలకు దారితీస్తోంది. ఈక్రమంలో భారతీయ ఆహారంలో ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన పదార్థాలను చూద్దాం.
పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు - పప్పు, శనగ , రాజ్మా - అద్భుతమైన ప్రోటీన్ వనరులుగా పనిచేస్తాయి. మిల్లెట్లు (రాగి, జోవర్, బజ్రా) వంటి తృణధాన్యాలు, బియ్యం గోధుమ వంటి ప్రధాన ఆహారాలతో పాటు, వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వివిధ రకాల కాలానుగుణ కూరగాయలు, తృణధాన్యాలు , స్థానికంగా లభించే పదార్థాలను చేర్చడం ద్వారా, భోజనంలో అవసరమైన విటమిన్లు , ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. పాలిష్ చేసిన తెల్ల బియ్యానికి బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ వాడుకోవచ్చు. మిల్లెట్‌లలో ఫైబర్, ఇనుము, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
పప్పుధాన్యాలు మరో ప్రధానమైనవి చెప్పుకోవచ్చు. విటమిన్ సి . బి కాంప్లెక్స్ ఎక్కువ అందాలంటే.. పప్పులను రాత్రిపూట నానబెట్టి మొలకెత్తిన తరువాత వాడుకోవాలి. వీటికి అదనను రుచిని పోషకాలను అందించేలా ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి , ఇంగువ (హింగ్) కలుపు కోవచ్చు. ఇవి జీర్ణశక్తిని, పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
ఆకుకూరలు
మన ఆహారంలో ఆకుకూరలు ప్రధాన భూమికను పోషిస్తాయి. విటమిన్లు , ఖనిజాలు లభిస్తాయి. తక్కువ కొవ్వును, ఎక్కువ ఫైబర్‌ను పుష్కలంగా అందిస్తాయి.
రంగు రంగుల కూరగాయలు
మన భోజనంలో ప్రకృతి అందించిన రకరకాల రంగుల్లో లభించే కూరలతో కలర్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. గుమ్మడికాయ, పాలకూర, ఎర్ర బెల్ పెప్పర్స్, క్యారెట్లు, బీట్‌రూట్ ,రెడ్, ఎల్లో క్యాప్సికం, రంగుల క్యాబేజీ ఇలా రంగురంగుల కూరగాయలను చేర్చుకోవాలి.. ప్రతి రంగు వేర్వేరు ఫైటోన్యూట్రియెంట్లు , యాంటీఆక్సిడెంట్లను సూచిస్తుంది. వీటిని ఎక్కువ ఉడికించకుండా, లేదా ఆవిరి మీద ఉడికించడం ద్వారా గరిష్ట పోషకాలను పొందవచ్చు.

పులియబెట్టిన ఆహారాలను మర్చిపోవద్దు
పెరుగు, దోస పిండి, ఇడ్లీ, ఊరగాయలు వంటి పులియబెట్టిన ఆహారాలు సాంప్రదాయ భారతీయ సూపర్‌ఫుడ్ అనడం ఎలాంటి సందేహం లేదు. పేగు ఆరోగ్యానికి జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్‌లతో సమృద్ధిగా అందిస్తాయి. అలాగే రోజువారీ భోజనంలో తాజా పెరుగు లేదా మజ్జిగను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన గట్ ఆరోగ్యం మనం సొంతం. ఇవి విటమిన్లు, ఖనిజాలను సమర్థవంతంగా గ్రహించడానికి చాలా కీలకం.
వంట నూనెలు మార్చుకుందాం
ఒకే రకమైన నూనెకు అతుక్కుపోయే బదులు, కొవ్వు ఆమ్ల ప్రొఫైల్‌లను సమతుల్యం చేయడానికి ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె ,కొబ్బరి నూనెలను వంటల్లో వాడుకుంటే మంచిది. కోల్డ్-ప్రెస్డ్ , ఫిల్టర్ చేసిన నూనెలు ఎక్కువ పోషకాలను అందిస్తాచి అలాగే, ఒమేగా-3 తీసుకోవడం పెంచడానికి అవిసె గింజలు, పొద్దుతిరుగుడు లేదా చియా వంటి కొన్ని విత్తనాలను టాపింగ్స్‌గా లేదా చట్నీలలో చేర్చుకోవాలి.
స్మార్ట్ స్నాక్స్: నానబెట్టిన ఉడికించిన శనగలు, పెసలు, ఇతర గింజలు, ఫూల్‌మఖానా లాంటివి ఇంట్లోనే తయారు చేసుకొని తినడం ఉత్తమం.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్: అరటి, జామ,దానిమ్మ, పైనాపిల్, ద్రాక్ష, రేగుపళ్లు, యాపిల్ ఆయా కాలాల్లో అన్ని రకాల సీజనల్ పళ్లను మన ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి శరీరానికి అదనపు పోషకాలను, శక్తిని అందిస్తాయి.