రేపు పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్‌ మాక్‌ డ్రిల్‌ | India To Conduct Mock Drills Tomorrow In 4 States, Know Details Inside | Sakshi
Sakshi News home page

రేపు పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్‌ మాక్‌ డ్రిల్‌

May 28 2025 2:41 PM | Updated on May 28 2025 3:27 PM

India to conduct mock drills tomorrow in 4 states

సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాక్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ ఎత్తున పాకిస్తాన్‌ తన సైన్యాన్ని భారీ ఎత్తున మొహరించింది. దీంతో భారత్‌ అప్రమత్తమైంది.

 రేపు (మే29న) పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్‌ మాక్‌ డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూలో మాక్‌ డ్రిల్‌ను నిర్వహించనుంది. అయితే, మాక్‌ డ్రిల్ జరిగే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే మాక్‌ డ్రిల్‌ నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లను పూర్తి చేసింది. 

 ఇదే తరహా మాక్‌ డ్రిల్‌ ఈ నెల ప్రారంభంలో జరిగింది. ఏప్రిల్ 22న మినీ స్విట్జర్లాండ్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ మే 6, 7 తేదీల మధ్య పాక్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించింది. 

 భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు, మే 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్‌ పేరుతో మాక్ డ్రిల్‌ను నిర్వహించించింది. ఆపరేషన్‌ అభ్యాస్‌ కొన్ని వారాల తర్వాత ఈ గురువారం పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మరోసారి కేంద్రం మాక్‌ డ్రిల్‌ నిర్వహించనుంది. 

కాగా, భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే మాక్‌ డ్రిల్‌ ఉద్దేశం. ఇటీవల పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ముందు కంటే 1971లో పాకిస్తాన్‌తో పోరాడాల్సి రావడం, అంతకుముందు 1962,1965 యుద్ధ సమయంలో మాక్‌ డ్రిల్‌ జరిగింది. మళ్లీ దాదాపూ 50ఏళ్ల తర్వాత పౌరుల భద్రత దృష్ట్యా కేంద్రం ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు మాక్‌ డ్రిల్స్‌ చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement