
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో దాదాపు 20 స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. తనిఖీలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాఠశాళలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం ఉదయమే పశ్చిమ్ విహార్, రోహిణీ సెక్టార్-3లోని పలు పాఠశాలలతో సహా దాదాపు 20 స్కూల్స్ బాంబు బెదిరింపు మొయిల్స్ వచ్చాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. పలు పాఠశాల్లలో ఉన్న విద్యార్థులను బయటకు పంపించి.. తనిఖీలు చేశారు. ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదని పోలీసులు వెల్లడించారు. ఇక, ఢిల్లీలో నాలుగు రోజుల వ్యవధిలో 30కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారం మొదటి మూడు రోజుల్లో ఢిల్లీలోని 11 పాఠశాలలు, ఒక కళాశాలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో, స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
బీజేపీ సర్కార్‌పై మాజీ సీఎం ఫైర్..
దేశ రాజధాని వరుస బాంబు బెదిరింపుల విషయమై అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి అతిషి.. ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అతిషి ట్విట్టర్ వేదికగా.. ఈరోజు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి!. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బాధను ఆలోచించండి. ఢిల్లీలోని నాలుగు పాలనా యంత్రాలను బీజేపీ నియంత్రిస్తుంది. ఇంకా మా పిల్లలకు ఎటువంటి భద్రతను అందించలేకపోయింది!. ఇది దిగ్భ్రాంతికరం! అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
VIDEO | More than 20 schools in Delhi on Friday received bomb threats, triggering panic among the students and their parents. Delhi Police and other quick-response authorities have launched search and evacuation operations, an official said. This is the fourth such day this week… pic.twitter.com/xmnlP3HquW
— Press Trust of India (@PTI_News) July 18, 2025