
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగ పత్రాన్ని కోర్టులో సమరి్పంచింది. 2008లో గుర్గావ్‌లోని సెక్టార్ 83లో షికోహ్‌పూర్‌లో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ చార్జ్‌షీటులో ఈడీ పేర్కొంది. ఆ భూమిని స్కై లైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ ఓంకారేశ్వర్ ప్రాపరీ్టస్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది.
చెల్లింపు చెక్కులను మరో కంపెనీకి స్కై లైట్ రియాలిటీ జారీ చేసింది. ఈ రెండు సంస్థలకు వాద్రా యజమానిగా ఉన్నాయి. ఇక సేల్ డీడ్‌సమయంలో ఈ కంపెనీ వద్ద కేవలం రూ.1 లక్ష నగదు ఉంటే రూ.7.5 కోట్ల పెట్టి భూమిని కొనుగోలు చేయగల్గిందని ఈడీ చార్జ్‌షీటులో ప్రస్తావించింది.మరుసటి రోజే ఆ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ పేరిట మార్చేశారు. 24 గంటల్లోపే భూమి టైటిల్‌ను వాద్రా కంపెనీకి మార్చారు. ఈ ప్రక్రియకు సాధారణంగా కనీసం మూడు నెలలు పడుతుంది.
ఒక నెల తర్వాత హరియాణాలో హుడా ప్రభుత్వం స్కైలైట్ హాస్పిటాలిటీకి దాదాపు 2.71 ఎరాల భూమిలో గృహనిర్మాణ ప్రాజెక్టు అభివృద్ధికి అనుమతులు వచ్చాయి. ఫలితంగా భూమి విలువ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. 2008లో రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ ఆ ప్లాట్‌ను రూ.58 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే ఆ భూమి విలువ ఒకేసారి 700 శాతం పెరిగింది. డీఎల్‌ఎఫ్ రెండు మూడు దఫాలుగా వాద్రాకు నగుదు చెల్లింపులు జరిపింది.
2012లో ఈ భూమి వ్యవహారాన్ని బయటకు తెచ్చిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కాను అప్పటి ముఖ్యమంత్రి హుడా ఆదేశాల మేరకు వెంటనే బదిలీ చేయడానికి ప్రయత్నించి తరువాత రద్దు చేశారు. భూమి వ్యవహారంపై సమగ్రస్థాయిలో విచారణ జరిపిన ఖేమా ఆ భూమి మ్యూటేషన్‌ను రద్దు చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో ప్యానెల్ ఏర్పాటైంది.
2013లో హుడా ప్రభుత్వం వాద్రాకు, డీఎల్‌ఎఫ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భూ ఒప్పందాల్లో హుడా, వాద్రాలు అక్రమాలకు పాల్పడినట్లు 2018లో ఆరోపణలు వచ్చాయి. అందులో ఈ 3.5 ఎకరాల భూమి కూడా ఉంది. తప్పుడు డిక్లరేషన్ ఆధారంగా భూమిని కొనుగోలు చేశారని ఆరోపిస్తూ గుర్గావ్ పోలీసులు 2018 సెపె్టంబర్ 2న ఎఫ్‌ఐఆర్ నేమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.