breaking news
land deal
-
25 ఏకరాల భూమి కొన్న స్టార్ హీరో, ధర ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పూణేలోని ముల్షీ తాలూకాలో రూ. 16.42 కోట్లతో 25.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 1,04,000 చదరపు మీటర్లు ( సుమారు 25.7 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్నిరణ్బీర్ నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోనూ భారీ పెట్టుబడుల తరువాత తాజాగా డీల్ విశేషంగా నిలుస్తోంది.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సిఆర్ఈ మాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లావాదేవీ 2026 ఏప్రిల్ 30న నమోదైంది. ముల్షీలోని పింప్రి గ్రామంలో ఒకదానికొకటి ఆనుకుని ఉన్న నాలుగు భూభాగాలను రణబీర్ కొనుగోలు చేశారు. వీటి మొత్తం వైశాల్యం 1,04,000 చదరపు మీటర్లు (సుమారు 25.7 ఎకరాలు). అరుణ్ శ్రీరామ్ లూత్రా, నవీన్ శ్రీరామ్ లూత్రా ,మాలా ఉమేష్ మెహతా అనే వ్యక్తుల నుంచి ఈ స్థలాన్ని కొన్నారు. ఈ భారీ ల్యాండ్ డీల్ కోసం రణ్‌బీర్ ఏకంగా రూ. 82.13 లక్షలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.రణబీర్ కపూర్ ఇటీవల అయోధ్యలోని విలాసవంతమైన లేఅవుట్ 'ది సరయూ'లో రూ. 3.31 కోట్లతో 2,134 చదరపు అడుగుల ప్లాట్‌ను 2026 మే నెలలో కొనుగోలు చేశారు. ఆ పెట్టుబడి పెట్టిన కొద్ది నెలలకే ఈ కొత్త భారీ భూమి కొనుగోలు జరగడం విశేషం.ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?రణబీర్, అలియా నెట్‌వర్త్ పలు కథనాల ప్రకారం కపూర్ కుటుంబానికి చెందిన ఈ స్టార్ హీరో రణబీర్ కపూర్ నికర ఆస్తి విలువ రూ. 400 కోట్లు. జీక్యూ ఇండియా (GQ India) 2024 నివేదిక ప్రకారం, రణబీర్ కపూర్‌తో పోలిస్తే ఆలియా భట్ నికర ఆస్తి విలువ ఎక్కువ. ఆమె ఆస్తి రూ. 550 కోట్లు. ఇవి కాకుండా రణబీర్ సావన్ (Saavn), బెకో (Beco) వంటి పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. డ్రోన్‌ఆచార్య అనే ఏరియల్ ఇన్నోవేషన్స్ కంపెనీకి కూడా ఆయన మద్దతుగా నిలిచారు. అలాగే 'ఆర్క్స్' (Arks) వంటి వెంచర్లలో భాగస్వామ్యంతో పాటు, ముంబై సిటీ ఎఫ్‌సి (Mumbai City FC) ఫుట్‌బాల్ క్లబ్‌కు సహ-యజమానిగా ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్పాలి హిల్‌లోని 'కృష్ణ రాజ్ బంగ్లా' రణబీర్ రియల్ ఎస్టేట్ ఆస్తులలో ముఖ్యమైనది, దీని విలువ దాదాపు రూ. 250 కోట్లుగా చెబుతారు. పూణేలోని ట్రంప్ టవర్స్‌లో కూడా ఆయనకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆయన లగ్జరీ కార్ల కలెక్షన్లో బెంట్లీ కాంటినెంటల్ GT V8, రేంజ్ రోవర్, మెర్సిడెస్-AMG SL 55, G63 వంటి కార్లు ఉన్నాయి.ఇక వృత్తిపరమైన విషయానికొస్తే, రానున్న నెలల్లో రణబీర్ నటించిన రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. నవంబర్‌లో, నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణం పార్ట్ 1' (Ramayana Part 1)లో కనిపించనున్నారు. ఇందులో సాయి పల్లవి, యష్ , సన్నీ డియోల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2027 ప్రారంభంలో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్, విక్కీ కౌశల్ నటించిన 'లవ్ & వార్' (Love & War) అనే పీరియడ్-రొమాన్స్ చిత్రం విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ చిన 'యానిమల్' (2023) చిత్రంలో రణబీర్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. -
హాట్ టాపిక్‌గా బిగ్‌బీ అమితాబ్ రూ. 15 కోట్ల ల్యాండ్ డీల్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర్‌లో విరాళాల గోల్మాల్ వ్యవహారం దుమారం రేపుతున్న వేళ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో స్థలం కొనుగోలుకు సంబంధించిన అంశం ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. 'హిందుస్థాన్ టైమ్స్ ఇండియా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సమిట్ 2026'లో రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్త అభినందన్ లోధాఅమితాబ్ ల్యాండ్ డీల్ గురించిన విశేషాలను పంచుకున్నారు.2023లో తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ నుండి కొన్ని మిస్డ్కాల్స్, ఒక మెసేజ్ వచ్చిందని లోధా గుర్తుచేసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత సుమారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అభినందన్ లోధాకు అమితాబ్ స్వయంగా ఫోన్ చేశారట. స్థలం ధర తెలుసుకున్న మరుసటి రోజే రూ. 15 కోట్లు డీల్ ఒకే చేయడంతోపాటు, సంబంధిత సొమ్మను బదిలీ చేశారని లోధా వెల్లడించారు."కొన్ని మిస్డ్కాల్స్ తర్వాత, 'నేను అమితాబ్ బచ్చన్‌ను, మీకు వీలైనప్పుడు తిరిగి కాల్ చేయండి' అని ఒక మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే ఆయనకు తిరిగి కాల్ చేసానని లోధా చెప్పారు. ఈ సందర్బంగా తమ సంభాషణను గుర్తుచేసుకుంటూ.. ‘‘అభినందన్ జీ, నేను ఉత్తరప్రదేశ్ వాసిని, నాకు పవిత్ర అయోధ్య నగరంలో స్థలం కావాలి" అని బచ్చన్ తనతో చెప్పినట్లు లోధా పేర్కొన్నారు. అమితాబ్ మొదట స్థలం ధర ఎంత అని అడిగి, తనకు 15,000 చదరపు అడుగుల స్థలం కావాలని అడిగారని లోధా చెప్పారు. కి సుమారు రూ. 15 కోట్లు కావచ్చని తాను చెప్పగా, మరుసటి రోజే ఆయన రూ. 15 కోట్లు పంపించారన్నారు.బాలీవుడ్లో బిగ్‌బీ పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ గత కొన్నేళ్లుగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అమితాబ్ ఇప్పటికే పలు పెట్టుబడులు పెట్టారు. ఒక్క లోధా ప్రాజెక్ట్‌ల్లో మూడు చోట్ల, మొత్తంగా అయోధ్యలో నాలుగు చోట్ల పెట్టుబడులు పెట్టారు.మార్చి 2026 పెట్టుబడి: 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' సంస్థ నుండి అమితాబ్ బచ్చన్ రూ. 35 కోట్ల విలువైన 2.67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయోధ్యలో ఆయనకు ఇది మూడవ పెట్టుబడి కాగా, HoABL సంస్థతో నాలుగవ ప్లాట్ కొనుగోలు. ఈ స్థలం కంపెనీకి చెందిన 75 ఎకరాల భారీ ప్రాజెక్ట్ 'ది సరయు' (The Sarayu) సమీపంలో ఉంది.2025,మే : 'ది సరయు' ప్రాజెక్ట్‌కు ఆనుకుని ఉన్న 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను అమితాబ్ బచ్చన్ దాదాపు రూ. 40 కోట్లకు కొనుగోలు చేశారు.2024లో : అంతకుముందు 2024లో, HoABL కి చెందిన ఫ్లాగ్షిప్ మిక్స్డ్-యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 'ది సరయు'లో 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ఈ పెట్టుబడులపై అభినందన్ లోధా స్పందిస్తూ.. భూమి తరతరాల ఆస్తి, అది దీర్ఘకాలంలో విలువను మరింత పెంచుతుందనే నమ్మకానికి బచ్చన్ పెట్టుబడులే నిదర్శనమని పేర్కొన్నారు. అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పెట్టుబడుల మద్దతు కారణంగా, ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు అద్భుత మైన గమ్యస్థానంగా మారుతోందన్నారు.ఇదీ చదవండి: నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్ -
వాద్రాపై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగ పత్రాన్ని కోర్టులో సమరి్పంచింది. 2008లో గుర్గావ్లోని సెక్టార్ 83లో షికోహ్‌పూర్‌లో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ చార్జ్‌షీటులో ఈడీ పేర్కొంది. ఆ భూమిని స్కై లైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ ఓంకారేశ్వర్ ప్రాపరీ్టస్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. చెల్లింపు చెక్కులను మరో కంపెనీకి స్కై లైట్ రియాలిటీ జారీ చేసింది. ఈ రెండు సంస్థలకు వాద్రా యజమానిగా ఉన్నాయి. ఇక సేల్ డీడ్సమయంలో ఈ కంపెనీ వద్ద కేవలం రూ.1 లక్ష నగదు ఉంటే రూ.7.5 కోట్ల పెట్టి భూమిని కొనుగోలు చేయగల్గిందని ఈడీ చార్జ్‌షీటులో ప్రస్తావించింది.మరుసటి రోజే ఆ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ పేరిట మార్చేశారు. 24 గంటల్లోపే భూమి టైటిల్‌ను వాద్రా కంపెనీకి మార్చారు. ఈ ప్రక్రియకు సాధారణంగా కనీసం మూడు నెలలు పడుతుంది. ఒక నెల తర్వాత హరియాణాలో హుడా ప్రభుత్వం స్కైలైట్ హాస్పిటాలిటీకి దాదాపు 2.71 ఎరాల భూమిలో గృహనిర్మాణ ప్రాజెక్టు అభివృద్ధికి అనుమతులు వచ్చాయి. ఫలితంగా భూమి విలువ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. 2008లో రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ ఆ ప్లాట్‌ను రూ.58 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే ఆ భూమి విలువ ఒకేసారి 700 శాతం పెరిగింది. డీఎల్ఎఫ్ రెండు మూడు దఫాలుగా వాద్రాకు నగుదు చెల్లింపులు జరిపింది. 2012లో ఈ భూమి వ్యవహారాన్ని బయటకు తెచ్చిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కాను అప్పటి ముఖ్యమంత్రి హుడా ఆదేశాల మేరకు వెంటనే బదిలీ చేయడానికి ప్రయత్నించి తరువాత రద్దు చేశారు. భూమి వ్యవహారంపై సమగ్రస్థాయిలో విచారణ జరిపిన ఖేమా ఆ భూమి మ్యూటేషన్‌ను రద్దు చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో ప్యానెల్ ఏర్పాటైంది. 2013లో హుడా ప్రభుత్వం వాద్రాకు, డీఎల్ఎఫ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భూ ఒప్పందాల్లో హుడా, వాద్రాలు అక్రమాలకు పాల్పడినట్లు 2018లో ఆరోపణలు వచ్చాయి. అందులో ఈ 3.5 ఎకరాల భూమి కూడా ఉంది. తప్పుడు డిక్లరేషన్ ఆధారంగా భూమిని కొనుగోలు చేశారని ఆరోపిస్తూ గుర్గావ్ పోలీసులు 2018 సెపె్టంబర్ 2న ఎఫ్ఐఆర్ నేమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. -
మూడో రోజూ ఈడీ విచారణకు వాద్రా
న్యూఢిల్లీ: భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయనను ఆరు గంటలపాటు ప్రశ్నించి, స్టేట్మెంట్ రికార్డు చేశారు. మొత్తం మూడు రోజుల్లో 16 గంటలపాటు వాద్రాను ప్రశ్నించడం గమనార్హం. మూడో రోజు తన భార్య ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనపై, తన కుటుంబంపై రాజకీయ క్షుద్ర వేట జరుగుతోందని ఆరోపించారు. రాబర్ట్ వాద్రాపై ఈడీ త్వరలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. -
ఈ ఏడాది హైదరాబాద్‌లో అతి పెద్ద ల్యాండ్ డీల్ రూ.800 కోట్లు.. ఎక్కడంటే?
కరోనా సంక్షోభం చుట్టుముట్టినా హైదరాబాద్ నగరంలో రియల్ జోరు తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకైక మెట్రో పాలిటన్ సిటీ కావడంతో ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీనికి తోడు ఐటీ, ఫార్మా, ఏవియేషన్ రంగాల్లో నగరం దూసుకుపోతోంది. ఫలితంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఉప్పల్ భగాయత్ ఈ ఏడాది నగర వ్యాప్తంగా భూముల అమ్మకాలు జోరుగా సాగాయి. ఏడాది చివర్లో ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటికి మంచి స్పందన వచ్చింది. ఇక్కడ గజం భూమి ధర గరిష్టంగా రూ. 1.10 లక్షలు పలకగా కనిష్టంగా గజం ధర రూ. 53 వేలుగా ఉంది. రెండేళ్ల కిందట ఇక్కడ నిర్వహించిన వేలంలో కనిష్ట గరిష్టాలు వరుసగా రూ 30 వేల నుంచి రూ 79 వేల వరకు నమోదు అయ్యాయి. రూ. 800 కోట్లు అయితే ఈసారి లాండ్ పార్సిల్ కింద నార్సింగిలో జరిగిన ఓ ల్యాండ్ రికార్డు సృష్టించింది. ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న 25 ఎకరాల భూమిని ఏక మొత్తంగా రూ. 800 కోట్లకు రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ డీల్ ఫిబ్రవరిలో జరిగింది. 53 ఎకరాలు నార్సింగి ల్యాండ్డీల్ తర్వాత స్థానంలో శంషాబాద్‌లో జరిగిన డీల్ నిలిచింది. 53 ఎకరాల స్థలాన్ని రూ. 250 కోట్లకి ఐఆర్ఏ రియాల్టీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్‌లో చోటు చేసుకుంది. చదవండి: ఇళ్ల కొనుగోళ్లలో అదే జోరు! -
అటు పోర్నోగ్రఫీ కేసు : ఇటు వార్తల్లోకి శిల్పాశెట్టి తల్లి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపార వేత్త రాజ్‌కుంద్రా దంపతుల పోర్నోగ్రఫీ కేసు వివాదం కొనసాగుతుండగానే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. శిల్పాశెట్టి తల్లి సునంద శెట్టి వార్తల్లో నిలిచారు. ఒక భూమి కొనుగోలు విషయంలో రూ .1.6 కోట్ల మేర మోసపోయానంటూ చీటింగ్ కేసు నమోదు చేశారు. ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సుధాకర్ ఘారే నకిలీ పేపర్లతో ఒక ల్యాండ్‌ను విక్రయించారని సునందా ఆరోపించారు. తప్పుడు పత్రాలతో మోసం చేశాడని, రూ .1.6 కోట్లకు భూమిని విక్రయించాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. రాజ్ కుంద్రా బెయిల్ మరోసారి తిరస్కరణ బెయిల్ విషయంలో కుంద్రాకు మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. తన అరెస్ట్‌ను, పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తూ కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అనంతరం విచారణను శనివారానికి వాయిదా వేసింది. కాగా అశ్లీల చిత్రాలను తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై జూలై 19న పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రాను కీలక కుట్రదారుడిగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేసి, కోట్ల రూపాయలు దండుకున్నా డనేది కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసులో శిల్పా శెట్టికి క్లీన్చిట్ లభించే అవకాశాలు కూడా కనిపించడంలేదు. మరోవైపు ఈ కేసులో కుంద్రా కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు అప్రూవర్లుగా మారడంతో మరింత ఉచ్చు బిగుస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధం ఉన్న వ్యక్తుల ఖాతాల్లోని లావాదేవీలపై దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్యలో ‘భూ’కంపం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం కోసం జరిగిన ఒక భూమి కొనుగోలు వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 12వేల చదరపు మీటర్ల భూమి కొనుగోలులో భారీ అవినీతి దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ భూమిని కేవలం రూ.2కోట్లకు కొన్న వ్యక్తి నుంచి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అదేరోజున కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని, అయోధ్య రామాలయ ట్రస్ట్ స్కామ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ అవినీతి లావాదేవీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘శ్రమజీవుల విరాళాల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడం వారి నమ్మకాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. అక్రమ నగదు బదిలీ వ్యవహారమని, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో దర్యాప్తు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా∙డిమాండ్ చేశారు. రామాలయం నిర్మాణాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వ్యాపారంగా మలచుకున్నాయని ఒకప్పటి బీజేపీ భాగస్వామి అయిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓ ప్రకాశ్ రాజ్‌భర్ ఆరోపించారు. అసలు వివాదం ఏంటి? వివాదానికి కేంద్రబిందువైన ఆ భూమి కొనుగోలు పత్రాల ప్రకారం.. మార్చి 18న బాగ్ జైసీ గ్రామంలో కుసుమ్ ఫాటక్ అనే వ్యక్తి తన 12,080 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న భూమిని రవి తివారీ, సుల్తాన్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులను రూ.2 కోట్ల మొత్తానికి విక్రయించాడు. రవి, అన్సారీలు కొన్న అదే 18 వ తేదీన కేవలం కొద్ది నిమిషాల తర్వాత వీరిద్దరి నుంచి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏకంగా రూ.18.5 కోట్లు చెల్లించి ఆ భూమిని కొనుగోలు చేసింది. ట్రస్టు సభ్యులైన బీజేపీ నేత అనిల్ మిశ్రా, అయోధ్య మాజీ మేయర్ హ్రిషీకేశ్ ఉపాధ్యాయ్లు ట్రస్టు తరఫున సంతకాలు చేసి ఈ భూమిని కొన్నారు. ఈ వ్యవహారంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ముఖ్యపాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. వేరొకరి నుంచి రూ.2 కోట్లకు కొన్న భూమిని అదే రోజున కొద్ది నిమిషాల్లో రూ.16.5 కోట్లు ఎక్కువ చెల్లించి కొనాల్సిన అవసరమేముందని, ట్రస్టు సొమ్మును దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
రాహుల్ ఇలాంటివి ఆమోదిస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల నాయకులు వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను టార్గెట్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డ వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నారంటూ స్మృతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇలాంటి వాటిని ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. స్మృతి ఇరానీ ఆరోపణలకు స్పందించిన కపిల్ సిబల్ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ మెహుల్ చౌక్సీతో ప్రధానికి ఉన్న సంబంధాల గురించి స్మృతి స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ‘సమాచార శాఖ మంత్రి ప్రెస్మీట్లు పెడతారు గానీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలతో ప్రధానికున్న సంబంధాల గురించి అడగరు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం’ అంటూ ఎద్దేవా చేశారు. ముందు సీబీఎస్ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి దృష్టిసారించాలంటూ కపిల్ హితవు పలికారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ, మీడియాలో వచ్చిన నివేదికలను ఉటంకిస్తూ స్మృతి పలు ఆరోపణలు చేశారు. ‘మనీల్యాండరింగ్‌కు పాల్పడిన వ్యక్తి నుంచి రూ. 45.21 కోట్ల విలువైన భూమిని కపిల్ సిబల్ కేవలం లక్ష రూపాయలకే కొన్నారు. సిబల్, ఆయన భార్య గ్రాండ్ కాసిలా కంపెనీ యజమానులుగా ఉన్నారు. ఈ కంపెనీ కోసం వారు వడ్డీ లేని రుణాలు పొందా’రని అన్నారు. కంపెనీ పేరు మీద ఒకసారి భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత విలువ ఒక్కసారిగా రూ. 89 కోట్లకు చేరింది. ఈవిధంగా విలువ రెండింతలవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వం పీయూష్ గోయల్ అనే వ్యాపారిపై అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది. గోయల్ నుంచే కపిల్ సిబల్ ఈ కంపెనీని కొనుగోలు చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. -
'ప్రధాని అనే విషయాన్ని మోడీ మర్చిపోతున్నారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా జవాబిచ్చింది. సోమవారం హర్యానాలోని ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. డీఎల్ఎఫ్, వాద్రా మధ్య జరిగిన వివాదస్పద భూకేటాయింపులకు హర్యానా ప్రభుత్వం అనుమతివ్వడంపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని మోడీ అన్నారు. మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సాల్మన్ ఖుర్షీద్ ధీటుగా స్పందించారు. మోడీ ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మద్దతుదారులకు ఆయన ప్రసంగం ఉత్తేజం కలిగించేలానే ఉంది. అయితే జాగ్రత్తగా ప్రధాని మాట్లాడాలి అని ఖుర్షీద్ అన్నారు. వాద్రా, డీఎల్ఎఫ్ ల మధ్య జరిగిన 58 కోట్ల భూకేటాయింపులు 2012 అక్టోబర్ లో రద్దు చేశారు. -
రూ. 7 కోట్లకు మోసపోయిన రాంజెఠ్మలానీ
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ చెన్నైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ మధ్యవర్తి చేతిలో రూ. 7 కోట్లకు మోసపోయారు. ఈ మధ్యవర్తి నుంగంబాక్కంకు చెందినవాడని పోలీసులు తెలిపారు. రాంజెఠ్మలాని, మరో ఇద్దరు స్నేహితులు చెన్నై ప్రధాన ప్రాంతాల్లోని భూములు అమ్మకానికి ఉంటే తెలపాలని ఓ మధ్యవర్తిని ఆన్లైన్లో సంప్రదించారు. అతను వారిని నమ్మించి నగరం మధ్యలో మంచి స్థలం అమ్మకానికి ఉందని పేర్కొన్నాడు. స్థలంయజమాని తన మాటలు విశ్వసించడం లేదని, అతనికి నమ్మకం కలిగించాలంటే ముందుగా రూ. 7 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలన్నాడు. దీంతో వారు దళారీని నమ్మి డబ్బు చెల్లించగా అతను పత్తా లేకుండా పోయాడు.


