ఈ ఏడాది హైదరాబాద్‌లో అతి పెద్ద ల్యాండ్‌ డీల్‌ రూ.800 కోట్లు.. ఎక్కడంటే? | This Year Mega Land Deals In Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది హైదరాబాద్‌లో అతి పెద్ద ల్యాండ్‌ డీల్‌ రూ.800 కోట్లు.. ఎక్కడంటే?

Dec 9 2021 4:18 PM | Updated on Dec 9 2021 4:29 PM

This Year Mega Land Deals In Hyderabad - Sakshi

కరోనా సంక్షోభం చుట్టుముట్టినా హైదరాబాద్‌ నగరంలో రియల్‌ జోరు తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకైక మెట్రో పాలిటన్‌ సిటీ కావడంతో ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీనికి తోడు ఐటీ, ఫార్మా, ఏవియేషన్‌ రంగాల్లో నగరం దూసుకుపోతోంది. ఫలితంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

ఉప్పల్‌ భగాయత్‌
ఈ ఏడాది నగర వ్యాప్తంగా భూముల అమ్మకాలు జోరుగా సాగాయి. ఏడాది చివర్లో ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలం పాటికి మంచి స్పందన వచ్చింది. ఇక్కడ గజం భూమి ధర గరిష్టంగా రూ. 1.10 లక్షలు పలకగా కనిష్టంగా గజం ధర రూ. 53 వేలుగా ఉంది. రెండేళ్ల కిందట ఇక్కడ నిర్వహించిన వేలంలో కనిష్ట గరిష్టాలు వరుసగా రూ 30 వేల నుంచి రూ 79 వేల వరకు నమోదు అయ్యాయి. 

రూ. 800 కోట్లు
అయితే ఈసారి లాండ్‌ పార్సిల్‌ కింద నార్సింగిలో జరిగిన ఓ ల్యాండ్‌ రికార్డు సృష్టించింది. ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఉన్న 25 ఎకరాల భూమిని ఏక మొత్తంగా రూ. 800 కోట్లకు రాజపుష్ప ప్రాపర్టీస్‌ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ రెసిడెన్షియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ డీల్‌ ఫిబ్రవరిలో జరిగింది.

53 ఎకరాలు
నార్సింగి ల్యాండ్‌డీల్‌  తర్వాత స్థానంలో శంషాబాద్‌లో జరిగిన డీల్‌ నిలిచింది. 53 ఎకరాల స్థలాన్ని రూ. 250 కోట్లకి ఐఆర్‌ఏ రియాల్టీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్‌లో చోటు చేసుకుంది.
చదవండి: ఇళ్ల కొనుగోళ్లలో అదే జోరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement