ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌.. పోలీసులు అలర్ట్‌ | Warning Mails To Delhi Schools Police Alert | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌.. పోలీసులు అలర్ట్‌

Jul 16 2025 10:59 AM | Updated on Jul 16 2025 11:20 AM

Warning Mails To Delhi Schools Police Alert

ఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో పలు పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు, పేరెంట్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రెండు పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ద్వార‌కాలోని సెయింట్ థామ‌స్, వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబులు పెట్టిన‌ట్లు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. అప్ర‌మ‌త్తమైన పోలీసులు.. సెయింట్ థామ‌స్, వ‌సంత్ వ్యాలీ స్కూల్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ రెండు పాఠ‌శాల‌ల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకుని బాంబు, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. ఎలాంటి పేలుడు ప‌దార్థాలు ల‌భ్యం కాలేదు. దీంతో పాఠ‌శాల యాజ‌మాన్యాలు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం కూడా ఢిల్లీలో మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు స్కూళ్లు, భారత నావికాదళం నడుపుతున్న ఒక పాఠశాలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల అధికారులలో భయాందోళనలను రేకెత్తించింది. అయితే పూర్తి భద్రతా తనిఖీల తర్వాత అధికారులు ఈ బాంబు బెదిరింపులు నకిలీవిగా తేల్చారు పోలీసులు.

Advertisement
 
Advertisement
Advertisement