
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్‌లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు.
ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు.
కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది.
మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్‌ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్.
కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.
(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)