
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు.
2025-26 ఖరీఫ్ సీజన్(kharif season) కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) ఆమోదించింది. కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షల 70 వేల కోట్లు కేటాయించింది. క్వింటాల్ వరి మద్ధతు ధర రూ.69కి పెంచింది. తాజా పెంపుతో అది రూ.2,369కి చేరింది. ఇది సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు ఎక్కువ మద్దతు ధరగా నిర్ణయించింది. తాజా పెంపుతో
- వరి సాధారణ గ్రేడ్ ఏ క్వింటాలు 69 రూ పెంపు
- జొన్నలు క్వింటా రూ. 328 పెంపు
- సజ్జలు క్వింటా రూ.150 పెంపు
- రాగులు క్వింటా రూ.596 పెంపు
- మొక్కజొన్న క్వింటా రూ.175 పెంపు
- కందిపప్పు క్వింటా రూ.450 పెంపు
- పెసర్లు క్వింటా రూ.86పెంపు
- మినుములు క్వింటా రూ.400 పెంపు
- వేరుశెనగ క్వింటా రూ.480 పెంపు
- పొద్దుతిరుగు క్వింటా రూ.441 పెంపు
- సోయాబీన్ క్వింటా రూ.436 పెంపు
- కుసుములు క్వింటా రూ.579 పెంపు
- వలిసెలు క్వింటాల్‌కు రూ.820 పెంపు
- ప్రత్తి క్వింటాల్‌కు రూ.589 పెంపు
- నువ్వులు : క్వింటాల్‌కు రూ.579 పెంపు.
బద్వేల్-నెల్లూరు 4 లేన్ల రోడ్డుకు రూ.3,653 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సుమారు 108 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. వార్దా బల్లార్షా 4 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

#WATCH | Union Minister Ashwini Vaishnaw says, "A major decision has been taken for farmers. In last 10-11 years, massive increment in MSP has been done for Kharif crops. In this continuation, MSP has been approved by the cabinet for the Kharif marketing season 2025-26. The total… pic.twitter.com/q9CxNUqxRR
— ANI (@ANI) May 28, 2025