మార్నింగ్‌వాకే పాపమై పోయింది, పాడు కుక్క | Morning Walk Turns Into Nightmare As Neighbour Dog Mauls Bengaluru Woman | Sakshi
Sakshi News home page

మార్నింగ్‌వాకే పాపమై పోయింది, పాడు కుక్క

Jan 30 2026 6:13 PM | Updated on Jan 30 2026 6:22 PM

Morning Walk Turns Into Nightmare As Neighbour Dog Mauls Bengaluru Woman

వీధికుక్కల కేసుపై తీవ్ర చర్చోప చర్చలు నడుస్తుండగానే కుక్కల దాడికి సంబంధించి మరో ఘటన వెలుగు చూసింది.  బెంగళూరులోని ఒక నివాస ప్రాంతంలో పెంపుడు కుక్క ఒక మహిళపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన  దృశ్యాలతో నెటిజనులను కలవరపాటుగా గురిచేశాయి.  

పలు మీడియా నివేదికల ప్రకారం  ఈ ఘటన జనవరి 26న చోటు చేసుకుంది. ఉదయం సుమారు 6:54 గంటలకు హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని టీచర్స్ కాలనీలో మార్నింగ్‌ వాక్‌కోసం వెళ్లిన మహిళపై ఒక పెంపుడు కుక్క దాడి చేసింది. తనదారిన తాను పోతూ ఉండగానే ఉన్నట్టుడి దాడిచేసింది.  మెడ, ముఖం, చేతులు మరియు కాళ్లను కరిచేసింది. దీంతో ఆమెకు 50కి పైగా కుట్లు పడ్డాయి. ఆమెను రక్షించడానికి వచ్చిన వ్యక్తిపై కూడా దాడి చేసి, నానా బీభత్సం  చేసింది. మరో ఇద్దరు కూడా సాయానికి ముందుకు వచ్చారు. మొత్తంమీద చాలా ధైర్యంగా మహిళ తనను తాను విడిపించుకుంది.

బాధితురాలి నుండి కుక్కను దూరం చేయడానికి ఆ వ్యక్తి దాని మెడ పట్టుకుని లాగడం ఫుటేజీలో కనిపిస్తుంది.  మహిళ ఎలాగోలా లేచి, ఇంటి లోపలికి వెళ్లి, తన వెనుక గేటు మూసివేసింది. ఆమెకుముఖం, చేతులు , కాళ్ళకు గాయాలయ్యాయి మరియు ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుక్క యజమాని నిర్లక్ష్యంపై హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement