
ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం విమర్శలు గుప్పించారు. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలా ఉంటాయంటూ ఒమర్ అబ్దులా వ్యాఖ్యానించారు. రామాయణం వీడియోను ట్వీట్ చేశారు.
ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం విమర్శలు గుప్పించారు. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలా ఉంటాయంటూ ఒమర్ అబ్దులా వ్యాఖ్యానించారు. రామాయణం వీడియోను ఆయన షేర్ చేశారు.
కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా తలపడిన కాంగ్రెస్.. తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు చేసిన ఆఖరి పోరాటం నిరాశే మిగిల్చింది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారం చేసింది. కనీసం ఒక ఖాతా కూడా తెరవలేదు. 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడింది
2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమయింది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలువలేదు.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆప్ షాక్ ఇచ్చింది. దీంతో ఒంటరి పోటీ విషయంలో కాంగ్రెస్ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది.