జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది మృతి, ఆర్మీ జవాన్‌కు గాయాలు | Encounter Between Security Forces And Terrorists In Kashmir, Check More Details Inside | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది మృతి, ఆర్మీ జవాన్‌కు గాయాలు

Sep 8 2025 10:10 AM | Updated on Sep 8 2025 10:25 AM

Encounter Between Security Forces and Terrorists in Kashmir

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నేడు (సోమవారం) ఉదయం  భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందగా, సైనిక సిబ్బంది ఒకరు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన జూనియర్ కమిషన్డ్ అధికారి పరిస్థితి విషమంగా ఉంది.
 

ఉగ్రవాదుల ఉనికిపై సమాచారం అందగానే భద్రతా దళాలు గుడార్ అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ సమయంలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి గాయపడ్డారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ తెలిపింది.

గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. వారిలో ఒకరిని బాగు ఖాన్ గా గుర్తించారు. 1995 నుండి 100 కి పైగా చొరబాటు ప్రయత్నాలు చేశాడు. అధికారులు అతని గుర్తింపు కార్డును కనుగొన్నారు. అందులో అతను పాకిస్తాన్ నివాసి అని రాసి ఉంది. అతనిని 'సముందర్ చాచా' అని కూడా పిలుస్తారు ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్‌తో అతనికి సత్సంబంధాలున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement