జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్‌ | 3 Lashkar Linked Terrorists Arrested In Jammu And Kashmir Budgam | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్‌

May 16 2025 6:14 PM | Updated on May 16 2025 7:08 PM

3 Lashkar Linked Terrorists Arrested In Jammu And Kashmir Budgam

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లష్కరే తొయిబా సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుద్గాం జిల్లాలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

స్థానికంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా.. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉగ్రవాదులను ముజామిల్ అహ్మద్, ఇష్ఫాక్ పండిట్, మునీర్ అహ్మద్‌గా గుర్తించారు. వారి నుంచి పిస్టల్, హ్యాండ్ గ్రెనేడ్‌తో సహా పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మణిపూర్‌లోని చండేల్‌ జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు మృతి చెందారు. భారత్‌–మయన్మార్‌ అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని కొండప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. చండేల్‌ జిల్లా ఖెంగ్‌జోయ్‌ తహశీల్‌లోని న్యూ సంటాల్‌ గ్రామం వద్ద సాయుధులు సంచరిస్తున్నట్లు కోహిమాలోని ఈస్టర్న్‌ కమాండ్‌ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ మేరకు బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి.

 

 


 


 

-
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement