సాక్షి, చెన్నై: తమిళనాడు తంజావూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును వ్యతిరేకిస్తూ డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలను చేపడుతున్నారు. తంజావురులో షాపులని మూయిస్తున్నారు. అరెస్టును నిరసిస్తూ సీఎం విజయ్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు యత్నించారు. దీంతో టీవీకే, డీఎంకే కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
కావేరి ఇష్యూ నుంచి టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ఉదయనిధిని అరెస్టు చేయించారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.డీఎంకే నిరసనలకు పన్నీర్ సెల్వం నాయకత్వం వహిస్తున్నారు. అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనననలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కాగా సీఎం, విజయ్ సినీనటి త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్తకర పరిస్తితులు ఏర్పడ్డాయి.
మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ డీఎంకే కేంద్రకార్యాలయానికి చేరుకున్నారు. ఉదయనిధి అరెస్టుపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మరికాసేపట్లో విచారించనున్నట్లు సమాచారం.
పార్లమెంటులో చర్చ
కాగా ఉదయనిధి అరెస్టు అంశం ఉదయనిధి అరెస్టుపై పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. తమిళనాడులో భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆ పార్టీ ఎంపీ తిరిచ్చి శివ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయన్నారు. అయితే లా అండ్ అర్డర్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశంమని రాజ్యసభ స్పీకర్ బదులిచ్చారు.
🚨🇮🇳 #BREAKING — DMK cadres staged a protest in Thanjavur, condemning the arrest of opposition leader Udhayanidhi Stalin.
Protesters also burned an effigy of Chief Minister Vijay during the demonstration.#TamilNadu #DMK #Thanjavur #UdhayanidhiStalin pic.twitter.com/G3qUtWQGUm— WarPolitics (@TheWarPolitics0) August 4, 2026


