మళ్లీ ఓడిన తెలంగాణ | J&K Defeat Telangana 3-0 In Santosh Trophy Final Round | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన తెలంగాణ

Dec 22 2024 2:02 PM | Updated on Dec 22 2024 2:02 PM

జమ్మూ కాశ్మీర్ 3–0తో జయభేరి 

 సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు వైఫల్యం కొనసాగుతోంది. గ్రూప్‌ ‘ఎ’లో శనివారం దక్కన్‌ ఎరెనా మైదానంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో జమ్మూ కశీ్మర్‌ 3–0తో తెలంగాణపై ఘనవిజయం సాధించింది. తెలంగాణ రక్షణ పంక్తి లోపాలను ఆసరా చేసుకొని కశీ్మర్‌ స్ట్రయికర్లు, మిడ్‌ఫీల్డర్లు పదేపదే గోల్‌పోస్ట్‌వైపు దూసుకెళ్లారు.

 ఆట మొదలైన ఐదు నిమిషాల్లోనే జమ్మూ కశీ్మర్‌ ఖాతా తెరిచింది. హయత్‌ బషీర్‌ (5వ ని.లో) చేసిన గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగం ఇదే స్కోరుతో ముగిసింది. ద్వితీయార్ధంలో అరుణ్‌ నగియల్‌ (74వ ని.), ఆకిఫ్‌ జావిద్‌ ( 88 వ ని.) స్వల్ప వ్యవధిలో చేసి గోల్స్‌లో జమ్మూ జట్టు 3–0తో తెలంగాణపై ఏకపక్ష విజయం సాధించింది. కశీ్మర్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి విజయం కాగా... నాలుగు మ్యాచ్‌లాడిన ఆతిథ్య తెలంగాణ జట్టు ఇంకా బోణీ కొట్టలేదు. మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆతిథ్య జట్టు ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 

ఈ గ్రూపు నుంచి సర్వీసెస్, వెస్ట్‌ బెంగాల్, మణిపూర్‌ జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సరీ్వసెస్‌ 2–0తో రాజస్తాన్‌పై గెలుపొందింది. వరుసగా మూడు విజయాలతో నాకౌట్‌ చేరింది. రాజస్తాన్‌కు క్వార్టర్స్‌ చేరే అవకాశం మిగిలుంది. సోమవారం జరిగే లీగ్‌ మ్యాచ్‌లో జమ్మూ కశీ్మర్‌పై గెలిస్తే రాజస్తాన్‌ నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement